అల్లు అర్జున్ ఎంతటి దుర్మార్గుడంటే.. అసెంబ్లీలో అక్బరుద్దీన్ సంచలనం!

అల్లు అర్జున్ ఓ దుర్మార్గుడని MIM ఎమెల్యే అక్బరుద్దీన్ అన్నారు. 'తొక్కిసలాటలో మహిళా చనిపోయింది. పిల్లవాడు చావుబతుకుల్లో ఉన్నాడని చెబితే 'మన సినిమా హిట్ అయినట్టే' అని సంబరాలు చేసుకున్నాడు. ఈ విషయం సన్నిహితుల ద్వారా నాకు తెలిసింది' అని అసెంబ్లీలో చెప్పారు. 

author-image
By srinivas
New Update
Akbaruddin Owaisi: పోటీ పరీక్షల్లో ఉర్దూ భాషను పెట్టాలి.. అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ

Pushpa: అల్లు అర్జున్ రియల్ క్యారెక్టర్ గురించి MIM ఎమెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటన గురించి చెబితే పెద్దగా బాధపడకుండా సినిమా గురించి మాత్రమే సన్నిహితులతో చర్చించిన దుర్మార్గుడంటూ అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు. పుష్ప సినిమా రిలీజ్ రోజు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిందని పక్కనున్న వాళ్లు చెబితే.. 'అయితే మన సినిమా హిట్ అయినట్టే' అంటూ సంతోషం వ్యక్తి చేసినట్లు సన్నిహితుల ద్వారా తనకు తెలిసిందన్నారు. 

తొక్కిసలాట జరిగితే సినిమా హిట్టే..

ఈ మేరకు అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. 'ఒక సినిమా హీరో ఆదర్శంగా ఉండాలి. కానీ ఇలాంటి పనులు చేస్తాడా. పోలీసులు చెబుతున్న వినకుండా హీరోయిజం చూపించేందుకు వచ్చి రేవతి కుటుంబంలో తీరని శోఖం మిగిల్చారు. బయట మహిళా అభిమాని చనిపోయింది. చిన్న పిల్లవాడు చావు బతుకుల్లో ఉన్నాడని పోలీసులు చెబుతున్నా పట్టించుకోలేదు. తొక్కిసలాట గురించి సమాచారం ఇస్తే.. 'అయితే మన సినిమా హిట్ అయినట్టే' అంటూ సంబరాలు చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా వెళ్లిపోవాలని చెప్పినా వినకుండా.. సినిమా మొత్తం చూశాడు. బయటకొచ్చి కార్ రోప్ ఎక్కి చేతులూపుతూ హంగామా చేశాడు. మానవత్వం లేకుండా వ్యవహరించాడు' అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.

నీవు మనిషివేనా.. 

ఇక సీఎం రేవంత్ మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారన్నారు. అతను రోడ్ షో చేయడం వల్లే భారీగా అజాన్ థియేటర్ కు వచ్చారని చెప్పారు. థియేటర్ కి రావొద్దని పోలీసులు చెప్పినా వినలేదు.అల్లు అర్జున్ అసలు మనిషేనా? అసలు ఏం మనిషి ఇతను.. ప్రపంచంలో ఇలాంటి మనుషులు ఉంటారా? డీసీపీ వచ్చి బలవంతంగా అల్లు అర్జున్‌ని కారులో ఎక్కించే వరకు థియేటర్‌లోనే కూర్చున్నాడు. అల్లు అర్జున్ రిటర్న్ వెళ్తుంటే కూడా కారు రూఫ్ టాప్ నుండి బయటకి వచ్చాడంటూ ఫైర్ అయ్యారు. బాధితుల దగ్గరకు వెళ్లాలన్న బాధ్యత అల్లు అర్జున్‌కు లేదా అంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు