నవంబర్ 1న చనిపోబోతున్న.. RTVతో సంచలన విషయం చెప్పిన అఘోరీ! అఘోరీ తాజాగా RTVతో మాట్లాడింది. నవంబర్ 1వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఆత్మార్పణ చేసుకుంటానని తెలిపింది. మరణం నుంచి బయటపడితే సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానంది. మరణిస్తే శివయ్య దగ్గరకే వెళ్తానని తెలిపింది. By Seetha Ram 29 Oct 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి ఇటీవల ఓ మహిళా అఘోరి తెలంగాణలోని పలు ఆలయాలను సందర్శించింది. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో నగ్నంగా పూజలు చేసింది. అనంతరం సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలోనూ పూజలు చేసింది. అయితే అక్కడ పూజలు చేస్తున్న సమయంలో నగ్నంగా ఉన్న ఆ మహిళా అఘోరిని చూసి భక్తులు భయపడ్డారు. శరీరం మొత్తం విభూతితో మెడలో పుర్రెలు వేలాడదీసుకుని ఉండటంతో అంతా షాక్ అయ్యారు. Also Read : దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి? దీంతో మహిళా అఘోరి ఫుల్ ఫ్యామస్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఆమె వీడియోలే.. ఎక్కడ విన్నా ఆమె పేరే. సోషల్ మీడియా, మీడియాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చి ఫుల్ పాపులర్ అయిపోయింది. ఆ ఇంటర్వ్యూలలో నాగ సాధుగా ఉన్న ఆమె అఘోరిగా ఎందుకు మారాల్సి వచ్చింది. అందుకు దారి తీసిన పరిస్థితులు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ రావడానికి గల కారణాలను సైతం ఆ మహిళా అఘోరి తెలిపింది. Also Read : 10 నిమిషాల రన్నింగ్‌తో ఆ ప్రమాదకరమైన వ్యాధులు దూరం అదే సమయంలో RTV ఆ అఘోరి తల్లిదండ్రులను కలిసి సంచలన సమాచారాన్ని సైతం రాబట్టారు. ఇలా ఓ వైపు అఘోరి గురించి వార్తలు వైరల్ అవుతుండగా.. మరోవైపు నుంచి పలువురు విమర్శలు కూడా చేశారు. అంతేకాకుండా తనపై నెగెటివ్‌గా వీడియోలు చేసి యూట్యూబ్‌లలో పోస్ట్‌లు చేశారు. దీంతో ఆ మహిళా అఘోరి కోపంతో రగిలిపోయింది. మళ్లీ అక్టోబర్ 29న తిరిగి హైదరాబాద్‌కు వస్తానంటూ కేదరినాథ్ నుంచి వీడియోలు పంచుకుంది. Also Read : KTR, హరీష్ మధ్య కొట్లాట.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు! RTVతో అఘోరీ సంచలన విషయాలు ఇక అనుకున్నట్లుగానే అఘోరీ ఇవాళ (అక్టోబర్ 29న) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు RTVతో ప్రత్యేకంగా మాట్లాడింది. నవంబర్ 1వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటన చేసింది. సనాతన ధర్మంపై పోరాటంలో తాను ఆత్మార్పణ చేసుకుంటానని తెలిపింది. ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన వారిని ఎందుకు వదిలేస్తున్నారు అని ప్రశ్నించింది. Also Read : చంపేస్తామంటూ.. బాబా సిద్దిఖీ కుమారుడికి బెదిరింపులు దాడి చేసిన వ్యక్తుల్ని తమకు అప్పగించాలని కోరింది. తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని నిరూపిస్తానని తెలిపింది. ఈ ఆత్మార్పణలో మరణం నుంచి బయటపడితే.. సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళతానని పేర్కొంది. ఒకవేళ మరణిస్తే శివయ్య దగ్గరకే వెళతా అని తెలిపింది. తెలంగాణలోకి ఇప్పుడే వచ్చా రేపు కొండగట్టు, వేములవాడ వెళతానని చెప్పింది. అలాగే గురువారం కొమురవెల్లి, ఏడుపాయలకు వెళతానని తెలిపింది. #aghori #aghori latest news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి