/rtv/media/media_files/2025/07/15/acb-searches-former-chief-engineer-of-irrigation-department-shetty-muralidhar-rao-house-2025-07-15-09-07-32.jpg)
ACB searches former Chief Engineer of Irrigation Department Shetty Muralidhar Rao house
తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజినీర్ చెట్టి మురళీధర్ రావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ సోదాలు జరిగాయి.
ఏసీబీ దాడులు
సమాచారం ప్రకారం.. జూలై 15 (మంగళవారం) ఉదయం ఏసీబీ అధికారులు మురళీధర్ రావు నివాసంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆయన నివాసంలో ఈ సోదాలు జరిగాయి. ఇంజినీర్ ఇన్ చీఫ్ గా పని చేస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణల నేపథ్యంలో.. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్‌లతో సహా మొత్తం 10 వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో భాగంగా కొన్ని కీలక ఆధారాలు లభించడంతోనే ఏసీబీ ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా మురళీధర్ రావు తెలంగాణ నీటిపారుదల శాఖలో కీలక పదవులలో పనిచేశారు. గతంలో మెడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు సంఘటన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను ఇంజినీర్-ఇన్-చీఫ్ (జనరల్) పదవి నుండి రాజీనామా చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.