తెలంగాణ సీఎం రేవంత్ రెడ్ది విదేశీ పర్యటనకు లైన్ క్లియర్ అయింది. సీఎం ఫారిన్ టూర్ కు ఏసీబీ కోర్టు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2025 జనవరి 13వ తేదీ నుంచి 23 వరకు ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్, బ్రిస్బేన్, దావోస్ పర్యటలకు సీఎం వెళ్లాల్సి ఉంది. అయితే ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తన పాస్‌పోర్టును ఏసీబీకి అప్పగించారు. అయితే ఇప్పుడు విదేశీ పర్యటనలో భాగంగా సీఎం ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఆరు నెలలపాటు పాస్‌పోర్టు ఇవ్వాలని రేవంత్ కోర్టును అభ్యర్థించగా .. ఈ అంశాన్ని పరిశీలించిన న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరిగి 2025 జులై 6వ తేదీ లోపు పాస్‌పోర్టు తిరిగి అప్పగించాలని ఏసీబీ కోర్టు ఆయనను ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన జనవరి13వ తేదీ నుంచి సీఎం రేవంత్ వీదేశాల్లో పర్యటించనున్నారు. ముందుగా జనవరి 13న ఆస్ట్రేలియా వెళ్లనున్న సీఎం .. అక్కడ క్వీన్స్‌ల్యాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శిస్తారు. క్రీడాకారులకు అక్కడ కలిపిస్తున్న సదుపాయాలను సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేయనుంది.ఈ క్రమంలో ఈ టూర్ ప్రాధన్యతను సంతరించుకుంది. అక్కడినుంచి సీఎం 15వ తేదీన తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. తిరిగి జనవరి 19వ తేదీ నుంచి 21 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పర్యాటక పాలసీని ప్రకటించిన నేపథ్యంలో... సింగపూర్ టూర్ ప్రాధన్యతను సంతరించుకుంది. జనవరి 21 నుంచి 23 వరకు దావోస్‌లో సీఎం పర్యటించనున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ పాల్గొంటారు. రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబు.. ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు వెళ్లనున్నారు. Also Read : చిరంజీవికి పవన్ కళ్యాణ్ అంటే అంత ప్రేమా? వైరల్ అవుతున్న వీడియో