Telangana: రాష్ట్రంలో 162 మంది వ్యవసాయ విస్తరణాధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులు మరణించిన వెంటనే బీమా పథకం కోసం వివరాలు నమోదు చేయలేదనే కారణంతో వారి పై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. జిల్లాల వారీగా సస్పెన్షన్ల పై కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: ఖైరతాబాద్ RTA ఆఫీస్ లో రామ్ చరణ్.. వైరల్ అవుతున్న న్యూలుక్, ఆ సినిమా కోసమేనా?
ఇందులో 80 మంది మహిళా అధికారులు ఉన్నారు. అయితే పంటల డిజిటల్ సర్వేలో పాల్గొనడానికి నిరాకరిస్తూ..మొబైల్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోలేదనే కారణంతోనే తమను సస్పెండ్ చేశారని ఏఈవోలు ఆరోపిస్తున్నారు. ఓ ఉన్నతాధికారి కుమారుడి సంస్థకు చెందిన యాప్ వివరాలు నమోదు చేయించేందుకు ఇతర రాష్ట్రాలకు భిన్నంగా తమ పై సర్వేల భారం మోపుతున్నారని దశల వారీగా ఆందోళనలు చేస్తున్నారు.
Also Read: రికార్డులకు అమ్మ మొగుడు.. వన్ అండ్ ఓన్లీ ప్రభాస్
ఏఈవోలను సస్పెండ్ చేస్తూ..
ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏఈవోలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో సస్పెండైన ఏఈవోలు హైదరాబాద్ లోని వ్యవసాయ డైరెక్టరేట్ కి తరలివచ్చారు. డైరెక్టర్ గోపి కార్యాలయం ముందు బైఠాయించారు. ఆయన వారిని కలవకుండానే వెళ్లిపోవడంతో డైరెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Also Read: నిఘా పెట్టాల్సింది, తప్పు చేశా.. సమంత షాకింగ్ కామెంట్స్
తమ సంజాయీషీ తీసుకోకుండానే చర్యలు తీసుకోవడం దారుణమని తెలిపారు. ఓ ఉన్నతాధికారి ప్రయోజనం కోసం తమను తీవ్రంగా ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సస్పెన్షన్ లు ఎత్తివేయాలని, లేని పక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని చెప్పారు. వారికి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య నేత జీవన్ వారికి మద్దతు తెలిపారు. రాత్రి వరకు ధర్నా కొనసాగింది.
Also Read: ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు.. కొనసాగుతోన్న వాయుగుండం
కొంత మంది ఏఈవోలు పంటల డిజిటల్ సర్వేను అడ్డుకుంటున్నారు. పంటల నమోదు వారి ప్రాథమిక బాధ్యత. 2018-19 నుంచి వ్యవసాయఖాఖే పంటల నమోదు చేపడుతోంది. ప్రతి 5 వేల ఎకరాలకు ఒకరు చొప్పున మొత్తం 2,617 మంది ఏఈవోలతో పట్టాదారు వారిగా నిర్వహిస్తున్నారు. గతంలో కంటే మెరుగ్గా నమోదు చేయాలని ఈసారి డిజిటల్ సర్వే చేపట్టేందుకు సెప్టెంబరులోనే ఉత్తర్వులిచ్చాం అని వ్యవసాయశాఖ సంచాలకుడు గోపి ఓ ప్రకటనలో తెలియజేశారు.