ఖైరతాబాద్ RTA ఆఫీస్ లో రామ్ చరణ్.. వైరల్ అవుతున్న న్యూలుక్, ఆ సినిమా కోసమేనా?

రామ్ చరణ్ ఖైరతాబాద్ RTA ఆఫీస్ లో సందడి చేశారు. తన కొత్త రోల్స్ రాయిస్ కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ RTA కార్యాలయానికి వచ్చారు. కారు రిజిస్ట్రేషన్ కోసం ఫొటో దిగి, సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటికొచ్చాయి. అందులో చరణ్ న్యూలుక్ వైరలవుతోంది.

New Update
rc (1)

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఖైరతాబాద్ RTA ఆఫీస్ లో సందడి చేశారు. తన కొత్త రోల్స్ రాయిస్ కారు రిజిస్ట్రేషన్ పనిమీద ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి వచ్చారు. కారు రిజిస్ట్రేషన్ కోసం ఫొటో దిగి, సంతకం చేశారు. జేటీసీ రమేశ్‌.. చరణ్‌ కారు రిజిస్ట్రేషన్‌కు అవసరమైన సేవలను అందించారు. 

రామ్‌చరణ్ రవాణాశాఖ కార్యాలయానికి వస్తున్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి తన అభిమాన నటుడితో ఫొటో దిగారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Also Read : బిగ్ బాస్ షోలో గంగవ్వకు గుండెపోటుపై కీలక ప్రకటన

ఫ్యాన్సీ నంబర్ 

రామ్ చరణ్ తన కొత్త కారు కోసం ఫ్యాన్సీ నంబర్ తీసుకున్నారు. TG 09 2727 అనే ఫ్యాన్సీ నంబర్‌ తో చెర్రీ నయా లగ్జరీ కారు రిజిస్ట్రేషన్ అయింది. అయితే ఆర్టీఏ ఆఫీసులో రామ్ చరణ్ పూర్తిగా న్యూలుక్ తో దర్శనమిచ్చారు. గేమ్ ఛేంజర్ కోసం గడ్డం తీసేసిన చరణ్.. ఇప్పుడు ఫుల్ బియర్డ్ లుక్ తో కనిపించాడు. అలాగే కాస్త లావు కూడా అయ్యాడు. అయితే చరణ్ లేటెస్ట్ లుక్ చూసిన ఫ్యాన్స్.. ఇది 'RC16' మూవీ కోసమే అని కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్‌' సినిమా విషయానికొస్తే.. శంకర్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ప్రముఖ నిర్మాత దిల్ రరాజు పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నారు.

Also Read : అన్ స్టాపబుల్ లో జూ.ఎన్టీఆర్ ప్రస్తావన.. బాలయ్య, చంద్రబాబు మధ్య హాట్ డిస్కషన్?

Advertisment