South Central Railway: నెల రోజుల పాటు ఆ 12 రైళ్లు రద్దు!

నిర్వహణ పనుల వల్ల వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న 12 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ రైళ్లు అక్టోబర్‌ 1 నుంచి అక్టోబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Railway : రైల్వే శాఖ కీలక నిర్ణయం... ఇక నుంచి అలా చేస్తే జరిమానా తప్పదు!
New Update

South Central Railway: నిర్వహణ పనుల వల్ల వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న 12 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. కాచిగూడ-నిజమాబాద్‌, నిజామాబాద్‌-కాచిగూడ, మేడ్చల్‌-లింగంపల్లి, లింగంపల్లి-మేడ్చల్‌, మేడ్చల్‌ -సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-మేడ్చల్‌, మేడ్చల్‌-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-మేడ్చల్‌ , మేడ్చల్‌ -సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-మేడ్చల్‌, మేడ్చల్‌-సికింద్రాబాద్‌ రైళ్లను అక్టోబర్‌ 1 నుంచి అక్టోబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కాచిగూడ-మెదక్‌ ను కాచిగూడ-మల్కాజిగిరి మధ్య అక్టోబర్‌ 1 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్ఉల అధికారులు తెలిపారు. 

దసరా, దీపావళి పండగల రద్దీ నేపథ్యంలో కాచిగూడ, సికింద్రాబాద్‌ స్టేషన్ల నుంచి తిరుపతికి అక్టోబర్‌ 1 వ తేదీ నుంచి నవంబర్‌ 16 వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సౌత్‌ సెంటల్ర్‌ రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ- సికింద్రాబాద్‌ ఏడు సర్వీసుఉల, తిరుపతి-కాచిగూడ ఏడు సర్వీసులు, సికింద్రాబాద్‌-తిరుపతి 14 సర్వీసులు, తిరుపతి- సికింద్రాబాద్‌ 14 సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని జోన్‌ సీపీఆర్వో శ్రీధర్‌ తెలిపారు.

సికింద్రాబాద్‌-తిరుపతి రైళ్లు జనగామ, వరంగల్‌ మార్గంలో ..కాచిగూడ- తిరుపతి రైళ్లు ఉందానగర్‌, షాద్‌ నగర్‌ , మహబూబ్‌ నగర్‌ , గద్వాల మార్గంలో రాకపోకలు సాగిస్తాయని అధికారులు వివరించారు. 

 

 

#south-central-railway
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe