Women's Commission: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు మహిళా కమిషన్ షాక్ ఇచ్చింది. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ వ్యాఖ్యలు సుమోటాగా స్వీకరించిన కమిషన్.. ఆగస్టు 24న కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే విచారం వ్యక్తం చేసిన కేటీఆర్ సారీ చెప్పినా నోటీసులు పంపించింది మహిళా కమిషన్.
విచారం వ్యక్తం చేస్తున్నా..
ఈ మేరకు ఎమ్మెల్యే కేటీఆర్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై గురువారం కార్యకర్తల సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. దీనిపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మహిళలపై బీఆర్ఎస్ నేతలకు ఉన్న గౌరవం ఇదేనా కేటీఆర్?.. మీ నాన్న కేసీఆర్ నీకు నేర్పిన సంస్కారం ఇదేనా?అంటూ మండిపడ్డారు. అలాగే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన స్పందించారు. 'నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు.” అని అన్నారు.