Dharani: 'ధరణి' ఉంటుందా? ఊడుతుందా?.. అసెంబ్లీ సమావేశాల తర్వాత కీలక నిర్ణయం!

ధరని పోర్టల్ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల వేళ ధరణిని తొలగిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో ధరణిపై ఆయన వరుస సమీక్షలు నిర్వహించారు. ధరణి పోర్టల్‌పై అసెంబ్లీ సమావేశాల తరువాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

New Update
Dharani: 'ధరణి' ఉంటుందా? ఊడుతుందా?.. అసెంబ్లీ సమావేశాల తర్వాత కీలక నిర్ణయం!

Dharani: ధరణి మనుగడ ప్రశ్నార్థకం కానుంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి బుధవారం సచివాలయంలో ధరణిపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్ రూపకల్పన ఎవరికి ఇచ్చారు? టెండర్ పిలిచారా? ఏ ప్రాతిపదికన వెబ్‌సైట్‌ క్రియేట్ చేసేందుకు అవకాశం ఇచ్చారు? ధరణికి అసలు చట్టబద్ధత ఏంటి? అని అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18,46,416 మందికి ఇంకా పాస్ బుక్స్ ఇవ్వలేదని సీఎం పేర్కొన్నారు. 2,31,424 దరఖాస్తులు టీఎం33, టీఎం 15కు చెందినవి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ధరణి పోర్టల్‌పై సమగ్ర అధ్యయనం చేసి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశం ఇచ్చారు. ధరణిలో చాలా డేటా తప్పులు, పాసు బుక్స్‌లో తప్పులు సవరించాలని ఆయన చెప్పారు. సాదా బైనామాల్లో తప్పు తొలగించాలని, భూ సమగ్ర సర్వే నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. కంప్యూటర్లనే నమ్ముకోవద్దు, జమా బందీ రాయాలి, రికార్డులు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరోవైపు.. ధరణిపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, గ్రీవెన్స్ విధానాలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. భూ సమస్యలపై వినతులకు అందుబాటులోకి వచ్చిన మ్యాడ్యుళ్లు, వాటి ద్వారా వచ్చిన దరఖాస్తులు, పరిష్కరించిన దరఖాస్తులపై అధికారులు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో.. పలు అంశాలపై క్లారిఫికేషన్, అదనపు సమాచారమడిగారు సీఎం రేవంత్ రెడ్డి. సమగ్ర వివరాలతో మరో నివేదిక తయారు చేయాలని ఆదేశం ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి సమావేశం నిర్వహిస్తామని సీఎం చెప్పారు.

కేంద్రం ఇచ్చిన రూ.83 కోట్లు ఏమయ్యాయి..?

భూముల సర్వే, డిజిటలైజేషన్‌, టైటిల్‌ గ్యారంటీ చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.83 కోట్లు ఇచ్చిందన్న సీఎం.. ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిషేధిత భూముల జాబితా, అసైన్డ్‌, పట్టా భూముల వివరాలు సహా మంత్రులు లేవనెత్తిన అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని నవీన్‌ మిత్తల్‌ను సీఎం ఆదేశించారు. భూముల డిజిటలైజేషన్‌ కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ సమస్యలకు నిలయంగా మారిందని ఈ సందర్భంగా సీఎం అన్నట్టు సమాచారం. ధరణిని రద్దు చేసి ఆ స్థానంలో భూమాత పోర్టల్‌ తీసుకొస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఆ దిశగా సీఎం రేవంత్‌రెడ్డి ధరణిపై దాదాపు 2 గంటల పాటు సమీక్షించారు.

Also Read:

ధరణి పోర్టల్‌పై ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

ధరణిలో ప్రధాన ప్రాబ్లెమ్స్ ఇవే.. సీఎం రేవంత్ చేసే మార్పులేంటి?

Advertisment
Advertisment
తాజా కథనాలు