హైదరాబాద్‌లో ముంచెత్తిన వాన, ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

గత కొన్నిరోజులుగా కురిసిన వర్షానికి హైదరాబాద్‌తో సహా తెలంగాణ ప్రాంతమంతా తడిసిముద్దయ్యింది.నిన్న మాత్రం స్వల్ప బ్రేక్ ఇచ్చింది. హమ్మయ్యా వర్షాలు తగ్గుముఖం పట్టాయనుకునే సమయానికి మరోసారి హైదరాబాద్ నగరాన్ని సోమవారం (31-07-2023) వర్షం ముంచెత్తింది. దీంతో నగరంలోని ప్రజలంతా తీవ్ర అవస్ధలు పడ్డారు.రాబోయే 48 గంటల్లో మరోసారి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది.

New Update
హైదరాబాద్‌లో ముంచెత్తిన వాన, ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

ఒక్కసారిగా హైదరాబాద్ మహానగరాన్ని కారుమబ్బులు కమ్మేసి జంటనగరాలతో పాటుగా పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. నగరంలోని సికింద్రాబాద్, అమీర్‌పేట, కూకట్‌పల్లి, మాధాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్, బోరబండ, మియాపూర్, అల్విన్‌కాలనీ, హైదర్‌నగర్‌, మారేడ్‌పల్లి, బేగంపేట్, ప్యాట్నీ, ప్యారడైజ్, చిలకలగూడ, నారాయణగూడ, ఆర్టీసీ X రోడ్‌, హిమాయత్‌నగర్, అబిడ్స్, కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. కార్యాలయాల నుంచి ఇంటికి వచ్చే సమయంలో వర్షం పడుతుండటంతో ఉద్యోగులు, నగరవాసులంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

సోమవారం సాయంత్రం వరకు ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా నగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. మరోసారి వర్షం దాటికి నగరంలోని వ్యాపారులు పలు ఇబ్బందులకు గురయ్యారు. ద్విచక్రవాహనదారులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి నానా కష్టాలు పడ్డారు. మరోవైపు వర్షాలపై హైదరాబాద్ వాసులను అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది.

అత్యవసర వేళల్లో సంప్రదించాల్సిన ఫోన్‌నెంబర్లు

telangana-weather-news-heavy-rains-alert-hyderabad-city-predicts

రేపు మంగళవారం (01-08-2023) ఉదయం వరకు హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు కోరారు. ఏదైనా సమస్య తలెత్తినా అత్యవసర సహాయక చర్యల కోసం నగరవాసులు 040-21111111 లేదా 9000113667 జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సంప్రదించాలని కోరారు.

Advertisment
తాజా కథనాలు