TSGENCO: టీఎస్ జెన్‌కో పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..

టీఎస్‌ జెన్‌కో ఎగ్జామ్ వాయిదా పడింది. డిసెంబర్ 17 జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ పరీక్ష రోజునే మరికొన్ని పరీక్షలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామంది.

New Update
TSGENCO: టీఎస్ జెన్‌కో పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..

TSGENCO Exam Postponed: టీఎస్‌ జెన్‌కో ఎగ్జామ్‌ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్. జెన్‌కో రాత పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 17వ తేదీన జెన్సో పరీక్ష జరగాల్సి ఉండగా.. దానిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఇదే రోజున ఇతర ప్రభుత్వ పరీక్షలు ఉండటంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయమై పలువురు నిరుద్యోగులు కూడా ప్రభుత్వాన్ని కోరారు. జెన్కో ఎగ్జామ్ రోజునే.. ఇతర సంస్థల, కేంద్ర ప్రభత్వ పోటీ పరీక్షలు ఉండటంతో ఆ ఎగ్జామ్‌ను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు నిరుద్యోగులు. దాంతో స్పందించిన ప్రభుత్వం.. టీఎస్ జెన్‌కో పరీక్షను వాయిదా వేసింది. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాల కోసం అభ్యర్థులు టీఎస్‌ జెన్‌కో అధికారిక వెబ్‌సైట్ www.tsgenco.co.in సంప్రదించవచ్చునని తెలిపింది ప్రభుత్వం.

టీఎస్‌పీఎస్‌సీ మెంబర్ రాజీనామా..

టీఎస్పీఎస్సీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోమవారం సాయంత్రం సంస్థ చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయగా.. తాజాగా బోర్డు సభ్యుడు ఆర్. సత్యనారాయణ రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం నిరుద్యోగుల కోసం ఓలేఖ రాశారు. ‘నేను ఏ తప్పు చేయలేదు. అయినా పదవికి రాజీనామా చేస్తున్నాను. కొత్త కమిషన్ ఆధ్వర్యంలోనే నియామకాలు జరగాలన్న ఉద్యోగార్థుల ఆకాంక్షలను గౌరవిస్తున్నాను. ఇప్పుడే కాదు.. నేను నా విద్యార్థి జీవిత కాలం నుంచి కూడా నిరుద్యోగుల పక్షమే. ఇకముందు కూడా నిరుద్యోగుల పక్షమే. మీ అందరి ఆశలు, ఆకాంక్షలు వీలైనంత త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నాను.' అని అన్నారు. ఇదిలాఉంటే.. చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. పేపర్ లీకేజీ, తదితర వ్యవహారాలపై పూర్తి బాధ్యులను గుర్తించే వరకూ రాజీనామాలను ఆమోదించకపోవచ్చన్న ఊహాగానాలూ వెలువడుతున్నాయి.

Also Read:

అలాంటి వ్యక్తి సీపీగా.. సీఎం రేవంత్ సాహసోపేత నిర్ణయం..

టాలీవుడ్‌కు బిగ్ షాక్.. డ్రగ్స్‌ ఇష్యూపై సీఎం రేవంత్ ఫోకస్..

Advertisment
తాజా కథనాలు