TG News : విగ్రహ వివాదం వేళ సచివాలయంలో ఆసక్తికర పరిణామం.. స్వయంగా రంగంలోకి సీఎం!

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకోసం స్వయంగా సీఎం రేవంత్ రంగంలో దిగారు. మంగళవారం పలువురు నేతలతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

TG News : విగ్రహ వివాదం వేళ సచివాలయంలో ఆసక్తికర పరిణామం.. స్వయంగా రంగంలోకి సీఎం!
New Update

CM Revanth : తెలంగాణ రాజకీయాల్లో విగ్రహ వివాదం వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకోసం స్వయంగా సీఎం రేవంత్ రంగంలో దిగారు. మంగళవారం అధికారులతో కలిసి ఆయన స్థలాన్ని పరిశీలించారు. సచివాలయం ఆవరణలో భవన ప్రధాన ద్వారం ముందు భాగం విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిపారు.

ఈ మేరకు డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలం, ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి అనుగుణమైన డిజైన్ కూర్పుపై అధికారులతో చర్చించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటునకు రాష్ట్ర అధికార కేంద్రమైన సెక్రటేరియట్ సముచితమైన స్థానమని, అక్కడ తెలంగాణ తల్లిని సగర్వంగా, సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని మరోసారి తెలిపారు. ముఖ్యమంత్రి సలహాదారు వేమ నరేందర్ రెడ్డి, ఎంపీ కిరణ్‌ చామలతో కలిసి స్వయంగా తిరిగి పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

#cm-revanth #telangana-thalli-statue #dr-br-ambedkar-secretariat
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి