10th EXAMS: మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు.. నేడు ప్రకటన?

తెలంగాణ 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్. మార్చి 18వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది. దీనిపై ఈరోజు ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

New Update
10th EXAMS: మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు.. నేడు ప్రకటన?

Telangana 10th Exams: పదో తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక. 10 తరగతి పరీక్షలపై (10th Exams) కీలక అప్డేట్ వచ్చింది. పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మార్చి 18వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆలోచిస్తుంది. ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపినట్లు తెలుస్తోంది. విద్యాశాఖ పంపిన ప్రొపోజల్ కు రాష్ట్ర ప్రభుత్వం ఒకే అంటే ఈరోజు (శనివారం) షెడ్యూలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ సర్కార్ ఆదేశం కోసం విద్యాశాఖ అధికారులు వేచి చుస్తునారు.

తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు..

తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు జరగనుండగా.. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు రాత పరీక్షలను ఇంటర్ బోర్డు నిర్వహించనుంది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 28న ప్రారంభమై.. మార్చి 13న ముగుస్తాయి. సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 14 వరకు జరగనున్నాయి.

ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్:

* 28 ఫిబ్రవరి: సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1.
* 1 మార్చి: ఇంగ్లీష్ పేపర్ 1
* 14 మార్చి: మాథ్స్ పేపర్ 1A/ బోటనీ పేపర్ 1/ పొలిటికల్ సైన్స్ పేపర్ 1
* 6 మార్చి: మాథ్స్ పేపర్ 1b/ జువాలజి పేపర్ 1/ హిస్టరీ పేపర్ 1
* 11 మార్చి: ఫిజిక్స్ పేపర్ 1/ ఎకనామిక్స్ పేపర్1
* 13 మార్చి: కెమిస్ట్రీ పేపర్ 1/ కామర్స్ పేపర్ 1

సెకండియర్ పరీక్షల షెడ్యూల్..

* 29 ఫిబ్రవరి: సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
* 2 మార్చి: ఇంగ్లీష్ పేపర్ 2
* 5 మార్చి: మాథ్స్ పేపర్ 2A/ బాటనీ పేపర్ 2/ పొలిటికల్ సైన్స్ 2
* 7 మార్చి: మాథ్స్ పేపర్ 2B/ జువాలాజీ పేపర్ 2/ హిస్టరీ పేపర్ 2
* 12 మార్చి: ఫిజిక్స్ పేపర్2/ఎకనామిక్స్ పేపర్ 2
* 14 మార్చి: కెమిస్ట్రీ పేపర్ 2/ కామర్స్ పేపర్ 2

Also Read:

  1. సూర్యుడి రథంలో 7 గుర్రాలే ఎందుకుంటాయి? ఇంట్రస్టింగ్ స్టోరీ మీకోసం..!
  2.  అభయహస్తం అప్లికేషన్‌పై అనేక సందేహాలు.. సమాధానం ఏది?!

Advertisment
తాజా కథనాలు