తెలంగాణ తెచ్చుకున్నది ఆంధ్రా నేతల చెప్పులు మొయ్యటానికా? బీజేపీ, కాంగ్రెస్ లపై హరీష్ ఫైర్ గజ్వేల్‌లో శనివారం (29-07-2023) మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పలువురి నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లిని సంకల పెట్టుకున్నట్లు తెలంగాణ ద్రోహులంటూ మాజీ సీఎంలు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలపై ఫైర్ అయ్యారు. తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు వీరిని మోస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు వింటున్నారని, మరోవైపు చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వింటున్నారని నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. By Shareef Pasha 29 Jul 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) ముఖ్య అతిథిగా రావటాన్ని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తప్పుపట్టారు. తెలంగాణ తెచ్చుకున్నది ఆంధ్రా నాయకుల చెప్పులు మోయడానికా? తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారో బీజేపీ,కాంగ్రెస్ నేతలు (BJP, Congress) చెప్పాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సిద్ధిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం మంగోల్ గ్రామంలో నూతన గ్రామ పంచాయితీ భవనం, మహిళా మండలి భవనం ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు అక్కెన్నపల్లి వాగు జలకళను సంతరించుకోవటం పట్ల హరీశ్ సంబురం వ్యక్తం చేశారు. కొబ్బరికాయ కొట్టి పసుపు, కుంకుమ చల్లి, పూలతో గంగమ్మకు జలాభిషేకం చేశారు. అనంతరం ములుగు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్, వర్గల్ మండలం గౌరారంలో సర్కిల్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులకు మంత్రి మహమూద్ అలీతో (Mohd. Ali) తో కలిసి శంకుస్థాపన చేశారు. గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లిలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. Your browser does not support the video tag. ఆ ఇద్దరి నేతల వల్లే తెలంగాణ బతుకులు ఆగమాగం వైఎస్సార్ హయాంలో ఉచిత కరెంటు (Free Power) పేరిట ఉత్తదొంగ కరెంటు వచ్చేదని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు వింటుంటే, చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వింటున్నారని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి గురువు కిరణ్ కుమార్ రెడ్డి అని, చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఈ ఇద్దరి నేతల వల్లే తెలంగాణ ప్రజలు బతుకులు ఆగమయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముందు చూపుతో ఎవరు వ్యవహరిస్తున్నారో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరారు. BJP, కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్ రావు మండిపాటు Your browser does not support the video tag. బీజేపీ మూడు చట్టాలు తెచ్చి రైతులను బలి తీసుకున్నదని ఆయన విమర్శించారు.కేసీఆర్ రైతులకు మూడు పంటలు కావాలని అడిగితే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) రైతులకు 24 గంటలు కరెంటు వద్దని, మూడు గంటలకు చాలని అనడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మూడు గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శత్రువు అని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమానికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌ను ( KCR) ప్రజలు దీవించాలన్నారు. రైతు వ్యతిరేక చట్టాలతో వేలాది రైతుల చావుకు బీజేపీ (BJP) కారణమైందని ధ్వజమెత్తారు. #siddipet #minister-harish-rao #telangana-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి