Telangana: రాష్ట్రంలో ఆ పదేళ్లు నియంత పాలన.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

పాలకులు నియంతృత్వ ధోరణితో వెళ్తే తెలంగాణ సమాజం సహించదని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. 'గడిచిన 10ఏళ్లలో రాష్ట్ర పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించింనందుకే ప్రజలు చరమగీతం పాడారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం' అని అన్నారు.

Telangana: రాష్ట్రంలో ఆ పదేళ్లు నియంత పాలన.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు
New Update

Governor: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ గత ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. గడిచిన 10 ఏళ్లలో రాష్ట్ర పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరించారని మండిపడ్డారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌ తమిళిసై పోలీసులు, సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ప్రజలు ఊరుకోరు..

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. మన దేశం దేశ రాజ్యాంగం ఎంతో మహోన్నతమైనదని.. మన రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందుచూపు వ్యవహరించి దాన్ని తయారుచేశారన్నారు. అన్ని వర్గాల ఆశలు, ఆశయాల సాధనకు దేశ రాజ్యాంగం తోడ్పడిందని, భిన్న జాతులు, మతాలు, కులాల సమహారమే భారత్ అని తెలిపారు. అందరినీ ఐక్యం చేసి ఒకే జాతిగా నిలబెట్టిన ఘనత రాజ్యాంగానిదేనన్నారు. బడుగు బలహీన వర్గాల వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజ్యాంగ మార్గదర్శకత్వంలో ముందుకు సాగడమనేది గర్వించే విషయమన్నారు. రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరుని, పోరాటాలు, తీర్పుల వల్ల అధికారాన్ని అప్పగించే శక్తి వారికి ఉందన్నారు.

నియంతృత్వ ధోరణి..

రాజ్యాంగం ఇచ్చిన హక్కుల వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. గడిచిన పదేళ్లలో రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా పాలకులు రాష్ట్రాన్ని పాలించారన్నారు. నియంతృత్వ ధోరణితో వెళ్తే తెలంగాణ సమాజం సహించదని.. ఎన్నికల్లో ప్రజల తీర్పు ద్వారా నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడారన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని.. అహంకారం, నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని తెలిపారు. విధ్వంసానికి గురైనటువంటి వ్యవస్థలను మళ్లీ నిర్మించుకుంటున్నామని గవర్నర్‌ అన్నారు. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కొత్త ప్రభుత్వం పనిచేస్తోందని.. ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే లక్ష్యమన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైందని.. ‘మహాలక్ష్మి’ కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. మిగతా గ్యారంటీలనూ అమలు చేస్తామని తెలిపారు. అభివృద్ధి విషయంలో ప్రపంచంతో పోటీపడేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి : Tripti: ఇలా జరుగుతుందని అసలే ఊహించలేదు.. ఇక పాఠం నేర్చుకోవాలి: త్రిప్తి డిమ్రి

ముఖ్యమంత్రికి అభినందనలు..

సంక్షేమంలో సరికొత్త అధ్యాయం లిఖించేలా కొత్త ప్రభుత్వ పాలన ఉంటుందని గవర్నర్‌ తెలిపారు. యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టామని, టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన పూర్తి కాగానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. దీనిపై ఎలాంటి అపోహలకూ యువతకు లోనుకావొద్దన్నారు. దావోస్‌ సదస్సులో రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని.. ఇందుకు సీఎం, ఆయన బృందాన్ని అభినందిస్తున్నానని గవర్నర్‌ తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. రూ.2 లక్షల రుణమాఫీకి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే యోచనలో ఉన్నామని గవర్నర్‌ తెలిపారు.

#telangana #governor-tamilisai #dictatorship
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe