TGSRTC: హైదరాబాద్-విజయవాడ మధ్య జర్నీ చేసే వారికి గుడ్ న్యూస్.. 10 శాతం డిస్కౌంట్!

హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు TGSRTC శుభవార్త చెప్పింది. ఆ రూట్‌లో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని ప్రకటించింది. రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది.

New Update
TGSRTC: హైదరాబాద్-విజయవాడ మధ్య జర్నీ చేసే వారికి గుడ్ న్యూస్.. 10 శాతం డిస్కౌంట్!

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఆ రూట్ లో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులలో ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరింది. ముందస్తు రిజర్వేషన్ కోసం https://tgsrtcbus.in వెబ్ సైట్ ను సందర్శించాలని కోరింది. కాగా ప్రీమియం బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అన్ని బస్సులు ఫుల్...

తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ శాతం భారీగా పెరిగింది. ఈ పథకాన్ని రాష్ట్రంలోని మహిళలలు మంచిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీ తో బస్సులు కిటకిటలాడుతున్నాయి. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులు రద్దీగా మారుతున్నాయి. ఈ బస్సుల్లోనే ఉచిత ప్రయాణం చేసేందుకు వీలు ఉండగా.. ఎక్కువ మంది ఈ బస్సులోనే ప్రయాణం చేస్తున్నారు. మరో వైపు రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో తెలంగాణ ఆర్టీసీ ఈ బస్సుల్లో ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్ కల్పించింది. కాగా ప్రస్తుతం విజయవాడ- హైదరాబాద్ రూట్లలో నడిచే రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులో ఈ ఆఫర్ ను ప్రకటించింది ఆర్టీసీ.

Advertisment
Advertisment
తాజా కథనాలు