TS Government: తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ.. గౌరవవేతనం ఎంతంటే?

ఏపీలో మాదిరిగా తెలంగాణలోనూ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మోడల్ ను ప్రభుత్వం అధ్యాయనం చేస్తున్నట్లు సమాచారం.

TS Government: తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ.. గౌరవవేతనం ఎంతంటే?
New Update

తెలంగాణలోనూ (Telangana) వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాంటి వ్యవస్థ ఉంటేనే 6 గ్యాంరెటీలు ప్రజల్లోకి వెళ్తాయని, సమర్ధవంతంగా ఆ పథకాలను అమలు చేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎన్నికల సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఈ వాలంటీర్లు పని చేయనున్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు సహాయం అందించేందుకు ఈ వాలంటీర్లను ప్రభుత్వ వినియోగించుకోనంది. ఈ నేపథ్యంలో వాలంటీర్ల ఎంపిక కోసం ప్రభుత్వం విధివిధానాలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: TS Govt Jobs: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఆ శాఖలో 6 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్!

వాలంటీర్లకు గౌరవవేతనంగా ఎంత ఇవ్వాలనే దానిపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో వాలంటీర్లకు రూ.5 వేలను గౌరవ వేతనంగా ఇస్తోంది జగన్ సర్కార్. ఈ వాలంటీర్ల నియామకం, అభ్యర్థుల ఎంపిక కోసం ఏపీ మోడల్ ను ప్రభుత్వం అధ్యాయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాలంటీర్ల ఎంపికలో స్థానిక నిరుద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Lok Sabha Election 2024: భువనగిరి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి?

ఏపీలో ఇలా..
ఏపీలో అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే జగన్ సర్కార్ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రతీ 50-100 ఇళ్లకు ఓ వాలంటీర్ ను నియమించింది. వారికి రూ.5 వేలు గౌరవ వేతనంగా అందిస్తోంది. ఈ వాలంటీర్ల ద్వారానే లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం, వారి వివరాలు సేకరించడం, పింఛన్ల పంపిణీ, ధృవపత్రాల పంపిణీ చేపడుతోంది ప్రభుత్వం.

ప్రతీ వాలంటీర్ వారి పరిధిలోని కుటుంబాలకు సంబంధించిన వివిధ పథకాల సమాచారాన్ని కలిగి ఉండేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో ప్రభుత్వం, ప్రజలకు మధ్య వీరు అనుసంధానకర్తలుగా మారి సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు.

#cm-revanth-reddy #telangana-government
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe