Telangana Corona Cases : తెలంగాణ(Telangana) లో కొత్త కరోనా కలకం రేపుతోంది. కొత్తగా నమోదవుతున్న కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్కొక్కటి మొదలైన పాజిటివ్ కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి. మొన్న 4, నిన్న 6, ఇవాళ మరో 6 కేసుల చొప్పున నమోదయ్యాయి. తాజాగా తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. గురువారం నాడు తెలంగాణలో 6 కేసులు నమోదవగా.. హైదరాబాద్‌లో 4 కేసులు, మెదక్ జిల్లాలో ఒకటి, రంగారెడ్డి జిల్లాలో ఒకటి చెప్పున కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 19కి పెరిగింది. ఇక ఇవాళ ఒకరు రికవరీ అయ్యారు.
మొత్తంగా కరోనా(Corona) కేసులును పరిశీలిస్తే.. తెలంగాణలో ఇప్పటి వరకు 8,44,519 పాజిటివ్ కేసులు నమోదవగా.. 8,40,389 కోలుకున్నారు. 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివ్ రేటు 0.49 శాతం ఉండగా.. రికవరీ రేటు 99.51 శాతంగా ఉంది. ఇక పోతే ఇవాళ ఒక్క రోజు 925
శాంపిల్స్ పరీక్షించారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,91,73,165 శాంపిల్స్ టెస్ట్ చేశారు. 54 మంది శాంపిల్స్ రావాల్సి ఉంది.
వరంగల్‌లో కలకలం..
వరంగల్ జిల్లాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టించింది. వరంగల్ ఎంజీఎంలో ఓ వ్యక్తికి కరోనా వచ్చినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. బాధితుడు భూపాలపల్లి జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఎంజీఎంలోకి మాస్క్ లేకుండా ఎవరినీ అనుమతించడం లేదు. ఈ ఘటనతో వరంగల్ ప్రజలు మళ్లీ భయబ్రాంతులకు గురవుతున్నారు.
Also Read:
ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. కీలక నిర్ణయాలు..