TG News : జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం.. సబ్సిడీ ధరలకే గోధుమలు!

జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ దుకాణాల్లో సబ్సిడీ ధరలకే గోధుమలు ఇస్తామన్నారు. బియ్యం నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

New Update
TG News : జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం.. సబ్సిడీ ధరలకే గోధుమలు!

Telangana Government : జనవరి నుంచి సన్న బియ్యం (Thin Rice) పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన బియ్యం అందించడమే తమ ప్రాధాన్యత అని గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిని మంత్రి ఉత్తమ్.. కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల హామీలో ఈ పథకం అత్యంత కీలకమని చెప్పారు. సబ్సిడీ ధరలకే గోధుమలు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

బియ్యం నాణ్యత లోపించకూడదు..
ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవినీతికి పాల్పడొద్దని, బియ్యం పక్కదారి పట్టించే వారిపై యాక్షన్ తీసుకుంటామని రేషన్‌ డీలర్లను హెచ్చరించారు. డీలర్‌షిప్‌ను రద్దు చేస్తామన్నారు. రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఇక మధ్యాహ్న భోజన పథకంలో సరఫరా అవుతున్న బియ్యం నాణ్యత లోపించాయని, సరిపడా బియ్యం అందడం లేదని ఈ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. దీంతో వెంటనే పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యతలోపించకుండా చూడాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెసిడెన్షియల్‌ పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న బియ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

రాష్ట్రంలో మొత్తం రేషన్ దుకాణాల్లో 1,629 ఖాళీగా ఉన్నాయని, వెంటనే ఈ దుకాణాలను భర్తీ చేయాలని అధికారులకు తెలిపారు. ఇక అంత్యోదయ కార్డుల సంఖ్యను పెంచాలని, రూ.500కే గ్యాస్ సిలిండర్లు అందించేలా పౌర సరఫరాల శాఖకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. చివరగా 10 రోజుల్లో వివిధ సమస్యలపై పూర్తి నివేదిక అందిస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ మంత్రులకు తెలిపారు.

Also Read : గద్దర్ అవార్డుల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు.. ఆ రోజే లోగో రిలీజ్!

Advertisment
తాజా కథనాలు