Kadiyam Srihari To Join Congress : తెలంగాణ రాజకీయాలు(Telangana Politics) వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) ఇంటికి కాంగ్రెస్(Congress) ముఖ్య నేతలు వెళ్లి భేటీ అయ్యారు. పార్టీలోకి రావాలని కడియంను వారి ఆహ్వానించారు. వారి ఆహ్వానానికి కడియం కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కడియం వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని కోరినట్లు తెలుస్తోంది. తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని.. ఆ స్థానంలో తన కూతురుకి అవకాశం ఇవ్వాలని ఆయన కోరగా కాంగ్రెస్ పెద్దలు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తన డిమాండ్లకు అంగీకరించడంతో రేపు లేదా ఎల్లుండి కడియం కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. శ్రీహరిని కలిసిన వారిలో పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, మల్లురవి, ఇతర ముఖ్యనేతలు ఉన్నారు.
ఇది కూడా చదవండి : Telangana : దానంకు కాంగ్రెస్ హైకమాండ్ ఝలక్..
అనుచరులతో చర్చించి నిర్ణయం:
భేటీ అనంతరం కడియం మాట్లాడుతూ.. తన అనుచరులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ కు చేరే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ లో చేరాలని తనకు ఏఐసీసీ, పీసీసీ నుంచి ఆహ్వానం అందిందన్నారు. వివిధ కారణాలతో బీఆర్ఎస్ క్షేత్ర స్థాయిలో బలహీనపడిందన్నారు. మిగతా అన్ని విషయాలను తర్వాత మాట్లాడుతానన్నారు.