ఏపీ పోలీసులకు షాక్.. తెలంగాణ పోలీసుల కేసు.!

తెలుగు రాష్ట్రాల మధ్య జల యుద్ధం మరింత ముదిరింది. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకొచ్చారని ఏపీ పోలీసులపై నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

New Update
ఏపీ పోలీసులకు షాక్.. తెలంగాణ పోలీసుల కేసు.!

Telangana V/S Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల మధ్య జల యుద్ధం మరింత ముదిరింది. నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ పోలీసులపై కేసు నమోదు అయ్యింది. ఏపీ పోలీసులపై నాగార్జున సాగర్ విజయపురి టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. A-1గా ఏపీ పోలీస్‌ ఫోర్స్‌ను పేర్కొంటూ తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకువచ్చారని ఫిర్యాదు చేశారు తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, మాచర్ల రూరల్ సీఐ, ఇరిగేషన్ అధికారులతోపాటు మరికొంతమందిపై నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

ఏపీ పోలీసులపై నమోదైన FIR కాపీ

500 మంది సాయుధ బలగాలతో సాగర్‌ డ్యామ్‌పైకి ఏపీ పోలీసులు వచ్చారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధాన డ్యామ్‌లోని 13 నుంచి 26 గేట్ల వరకూ ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారంటూ కంప్లైంట్ చేశారు. మరోవైపు అనుమతి లేకుండా ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు కుడికాల్వ 5వ గేటు నుంచి కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఏపీకి అక్రమంగా నీటిని వదిలారంటూ తెలంగాణ పోలీసులు ఫిర్యాదు చేశారు. 447, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఐజీ స్థాయి అధికారులు విచారణ చేపట్టారు. ఇకపోతే నాగార్జునసాగర్ దగ్గర హైటెన్షన్ కొనసాగుతుంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యాంపై పోలీస్ పహారా కొనసాగుతుంది. కృష్ణా రివర్ మేనేజ్‍మెంట్ బోర్డు నిబంధనలను ఏపీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని తెలంగాణ ఆరోపిస్తోంది.

Also Read: నాగార్జునసాగర్ దగ్గర కొనసాగుతున్న హైటెన్షన్..అసలు దీని వెనుక కథేంటి?

ఇదిలా ఉంటే నాగార్జున సాగర్ డ్యాం నుంచి ఏపీకి నీటి విడుదల కొనసాగుతోంది. సాగర్ డ్యాం వద్ద పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వం పోలీసులతో మోహరించిది. దీంతో డ్యాం వద్దకు భారీగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు చేరుకున్నారు. ఐజీస్థాయి అధికారులు సాగర్ చేరుకుని పరిస్థితి అంచనా వేస్తున్నారు. ఏపీకి నాగార్జున సాగర్ డ్యాం నుంచి నీటి విడుదల కొనసాగుతుందని తెలుస్తోంది. నాగార్జున సాగర్ నీటి మట్టం డెడ్ స్టోరేజ్‌కి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాగునీటి అవసరాల కోసమే నీటిని విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీంతో సాగర్ జలాల వివాదం తెరపైకి వచ్చినట్లైంది. దీంతో సాగర్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డ్యాంపై 1500 మంది ఏపీ పోలీసుల మకాం వేశారు. అటు తెలంగాణకు సంబంధించిన వెయ్యి మంది పోలీసులు మోహరించారు. దీంతో సాగర్ డ్యాం వద్ద యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది.

Also Read: కాశ్మీర్ ను కప్పేసిన మంచు దుప్పటి.. రోడ్స్ మూసివేత! 

కాగా, నాగార్జున సాగర్ డ్యామ్ లో 13వ గేటు వరకు ఏపీకి హక్కు ఉందని తేల్చిచెప్పారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. సారగ్ కుడి కెనాల్ నుండి నీటిని విడుదల చేయటం.. ఏపీ ప్రభుత్వం చేసిన చర్య న్యాయమైనది..ధర్మమైనదని అన్నారు. తెలంగాణ పోలింగ్ రోజున.. ఒక పార్టీకి లబ్ధికలిగేలా  కావాలనే జగన్ ఇదంతా చేయించారని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.  తెలంగాణలో ఒక పార్టీని గెలిపించాల్సిన, ఓడించాల్పిన అవసరం తమకు లేదని కామెంట్స్ చేశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు