IAS Officer CV Anand : హైదరాబాద్ (Hyderabad) సీపీగా సీనియర్ ఐఏఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీగా రెండోసారి భాద్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి కృతజ్ఞతలు తెలిపారు. వినాయకచవితి, మిలాద్ ఉన్ నబి పండుగలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తానన్నారు. గతేడాది కూడా రెండు పండుగలు ఒకేసారి వచ్చాయని గుర్తు చేశారు. అప్పుడు కూడా ఆయా పండుగలను ప్రశాంతంగా జరిపామన్నారు. ఇందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉందన్నారు.
ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై సీరియస్ గా ఉందన్నారు. డ్రగ్స్, గంజాయి (Drugs - Ganja) నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది.. పార్ట్ ఆఫ్ పోలీసింగ్ అని వివరించారు. కానీ కొందరు దానిని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారన్నారు. క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపక తప్పదన్నారు.
Also Read : అలా చేసినందుకు..? శ్రద్ధాకు బాలీవుడ్ డైరెక్టర్ క్షమాపణలు.!