Kaloji Narayana Rao: కాళోజీ కలం ధిక్కార స్వరం.. ఆయన బతుకంతా తెలంగాణ కోసమే!

సమాజం గొడవే తన గొడవగా భావించి తన రచనాల ద్వారా నిరంకుశత్వం, అరాచక పాలన, అసమానతలపై విమర్శనాస్త్రాలు సంధించిన తెలంగాణ కవి కాళోజీ. తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వనిగా నిలిచిన కాళోజీ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం ఈ ఆర్టికల్ లో చూడండి.

New Update
Kaloji Narayana Rao: కాళోజీ కలం ధిక్కార స్వరం.. ఆయన బతుకంతా తెలంగాణ కోసమే!

Kaloji Narayana Rao: ''పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది'' అని ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. నిరంకుశత్వానికి, నిజాం దమన నీతికి, అరాచక పాలనకు వ్యతిరేకంగా తన కలం ఎత్తి.. తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమ ప్రతిధ్వనిగా వినిపించిన తెలంగాణ తొలిపొద్దు కాళోజి జన్మదిన శుభాకాంక్షలు. కాళోజీ 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లి రమాబాయమ్మ, తండ్రి కాళోజీ రంగారావు. కాళోజీ చదువుకునే రోజుల్లోనే అన్యాయాన్ని ఎదిరించడానికి ముందుండేవారు. విద్యార్ధి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాలను ఎదిరించి వరంగల్ లో గణపతి ఉత్సవాలను నిర్వహించారు.
.@TelanganaCMO @revanth_anumula presented Kaloji Narayana Rao authored anthology Na Godava!
Kaloji was an anti-fascist and aligned with left movements. His writings were critically acclaimed. One of his poems was inspiration for T movement@NewIndianXpress@XpressHyderabad pic.twitter.com/c50XsUh1iJ

— B Kartheek (@KartheekTnie) July 6, 2024

అధికార దాహాన్ని, రాజ్యకాంక్షను, తన కలంతో అదిలిస్తూ.. ప్రజల గుండెల్లో స్వేచ్ఛ పథకాన్ని ఎగురవేయాలని పరితపించిన ప్రజా ధ్వని కాళోజి. 'నా గొడవ' పేరిట సామాజిక సమస్యల పై నిక్కచ్చిగా స్పందిస్తూ అధికారుల పై తన అక్షర ఆయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిపొందాడు. ''అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి.. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాద్యుడు'' అంటూ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిన మహా కవి. 1945లో రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన ధైర్యసాహసాలు ఇప్పటికీ మరుపురానివి.

కాళోజి వరంగల్ కోటలో జాతీయ పథకాన్ని ఆవిష్కరించడానికి బహిష్కరణ శిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో ఉస్మానియా విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహం తన కవితల్లో వినిపించిన ప్రజాకవి కాళోజి. ''నీ భాషలో బతుకున్నది, నీ యాసలోనే నీ సంస్కృతి ఉన్నది.. ఆ యాసాలున్న పలుకుబల్లనే తెలంగాణ జీవితం ఉన్నది'' అని చెప్పిన కాళోజి తన కవిత్వాలను తెలంగాణ యాసలోనే రాస్తూ తెలంగాణ భాషకు ప్రాణం పోశారు.

తెలంగాణాలో అక్షర జ్యోతిని ప్రోత్సహించాలనే ఆకాంక్షతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజి ఒకరు. తన కవితలతో తెలంగాణ భాష ఉనికిని కాపాడిన కాళోజి జన్మదినాన్ని తెలంగాణ భాష దినోత్సవంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. ''హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు'',  ''సామాన్యుడే నా దేవుడు'' అని గలమెత్తిన కాళోజి 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరును పెట్టి ఆయన సేవలను స్మరించుకుంది తెలంగాణ సర్కార్. ఏటా ఆయన జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఆ రోజు కాళోజీ పేరుమీద అవార్డును అందిస్తూ కవులు, కళాకారులను గౌరవిస్తోంది.

Also Read: Pawan Kalyan: కూతురు నిహారికకు పవన్ కళ్యాణ్ అభినందనలు..! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు