రుణమాఫీ అవుతుందా మాస్టారు?.. తెలంగాణలో గుసగుసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగానే ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను ఈ రోజు అమల్లోకి తెచ్చింది. అయితే, రుణమాఫీ, రైతు బంధు, పెన్షన్ పెంపు వంటి అంశాలపై తెలంగాణ ప్రజలు గుసగుసలాడుతున్నారట. ఇచ్చిన హామీలు నిజంగా అమలు చేస్తారా లేదా అని చర్చలు జరుపుతున్నారట. By V.J Reddy 09 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Rythu Runa Mafi: తెలంగాణలో ఎన్నికల పండుగ ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు పదేళ్లు కారులో తిరిగి.. తాజగా హస్తానికి హాయ్ చెప్పి రాష్ట్ర పగ్గాలను కాంగ్రెస్ పార్టీకి అప్పగించారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలతో తెలంగాణ ప్రజలను తమవైపు తిప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress Party) తాజాగా ఈ రోజు చెప్పిన ఆరు గ్యారెంటీల్లో రెండు అమలు చేసింది. అందులో మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ.. మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. మరోవైపు పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ కార్డును రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లుగానే ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమల్లోకి తీసుకొస్తామని మరోసారి తెలంగాణ ప్రజానీకానికి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండు రోజులే అయినా.. ప్రతిపక్ష పార్టీగా ఉన్న మాజీ అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పెంచిన రైతు బంధు నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. దీంతో పాటు పంటకు రూ.500 బోనస్ కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ALSO READ: BREAKING : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చింది. సీఎం రేవంత్ సమీక్షించిన తరువాత రైతుబంధు నిధులు విడుదల చేస్తామని తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలతో రైతులు ఆందోళన పడవద్దు అంటూ కోరింది. ఇదిలా ఉండగా రుణమాఫీ ఎప్పుడు చేస్తారు?.. అసలు ఈ ప్రభుత్వం చేస్తుందా? లేదా? అని తెలంగాణ పల్లెల నుంచి పట్నం దాకా ఉన్న ఛాయ్ దుకాణాల దగ్గర, టిఫిన్ బండ్ల దగ్గర చర్చలు పెడుతున్నారట పబ్లిక్. ఇందుకు కారణం గత ప్రభుత్వాలు చెప్పిన హామీలు నెరవేర్చకపోవడమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరీ కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టిన ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా? లేదా? అనేది చూడాలి. Hey #GumpuMestri, today is December 9th. Just a gentle reminder🤷♂️ pic.twitter.com/sgndF94mp5 — Putta Vishnuvardhan Reddy (@PuttaVishnuVR) December 9, 2023 #revanth-reddy #telugu-latest-news #rythu-runamafi #rythu-bandhu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి