Kondadaram: అక్టోబర్ 14 రాస్తారోకో కు అఖిలపక్ష పార్టీల పిలుపు!

TSPSC వైఫల్యం వల్ల,ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి యువజన వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల, నిరుద్యోగుల అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ,ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి అక్టోబర్ 14 న రాష్ట్రంలో నాలుగు రహదారులపై రాస్తారోకో నిర్వహించాలని అఖిల పక్ష రాజకీయ పార్టీలు , ప్రజా సంఘాల ఉమ్మడి వేదికలు పిలుపు ఇచ్చాయి.

New Update

ఈ రోజు ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ , తెలంగాణ జన సమితి, BSP, CPI,CPM, న్యూ డెమోక్రసీ, న్యూ డెమోక్రసీ, ప్రజా పంథా పార్టీలు, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, PDSU,SFI విద్యార్ధి సంఘాలు పాల్గొన్నాయి.

అక్టోబర్ 14 న ఉదయం 10.30 గంటల నుండీ 12.30 వరకూ జరిగే ఈ రాస్తారోకో కార్యక్రమంలో ప్రజలందరూ విద్యార్థులకు, యువతకు మద్దతుగా పాల్గొనాలని కోరుతున్నాము.
.
అక్టోబర్ 14 రాస్తారోకో పాయింట్స్

1.మహబూబ్ నగర్ నుండీ హైదరాబాద్ రహదారిలో మహబూబ్ నగర్,జడ్చర్ల, షాద్ నగర్,శంషాబాద్
2.వరంగల్ నుండీ హైదరాబాద్ రహదారి పై వరంగల్, స్టేషన్ ఘనపూర్, జనగాం, ఆలేరు, భువనగిరి, ఘటకేశ్వర్,
3.రామగుండం నుండీ హైదరాబాద్ రహదారిపై రామగుండంపెద్దపల్లి,కరీం నగర్,సిద్దిపేట, గజ్వేల్, శామీరు పేట, తూం కుంట
4. ఖమ్మం నుండీ హైదరాబాద్ రహదారిలో ఖమ్మం, కూసుమంచి, సూర్యాపేట, నక్రేకల్, నార్కట్ పల్లి, చిట్యాల, చౌటుప్పల్, హయత్ నగర్

అక్టోబర్ 14. రాస్తారోకో డిమాండ్లు

1.ప్రస్తుత బోర్డు చైర్మన్ తో సహా TSPSC సభ్యులను తొలగించి ,TSPSC చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త సభ్యులని నియమించాలి.
2. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి.
3.DSC పోస్టుల సంఖ్యను ముఖ్యమంత్రి అసెంబ్లీ లో ప్రకటించిన విధంగా 13500 కు పెంచాలి.(బ్యాక్ లాగ్ పోస్టులు కాకుండా అదనంగా )
4.పరీక్షల రద్దుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత వహించి పరీక్షలు రాసిన అభ్యర్థులకు మూడు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు