రెండుగా చీలిపోయిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్.!

ఖమ్మం జిల్లా టీఎన్జీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఎన్జీవో కార్యాలయం స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు వర్గీయులు. అయితే టీఎన్జీవో అధ్యక్షుడు అఫ్జల్ వర్గీయులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

New Update
రెండుగా చీలిపోయిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్.!

Telangana Non Gazetted Officers Union Fight: ఖమ్మం జిల్లా టీఎన్జీవో కార్యాలయం వద్ద హై టెన్షన్ నెలకొంది. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ రెండుగా చీలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో టీఎన్జీవో కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవాలని యత్నించారు టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు వర్గీయులు. అయితే, ఎక్కడ కార్యాలయాన్ని ఆక్రమిస్తారోనని అప్పటికే కార్యాలయానికి తాళ్ళం వేసేశారు ప్రస్తుత TNGO అధ్యక్షుడు అఫ్జల్ హసన్ వర్గీయులు. దీంతో, ఆ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది.

Also Read: హామీలు.. గ్యారెంటీలే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రభావం చూపించాయా?

టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు వర్గీయులు కార్యాలయాన్ని స్వాధీనం చేసుకొనడానికి వచ్చారని తెలుసుకున్న ప్రస్తుత TNGO అధ్యక్షుడు అఫ్జల్ హసన్ వర్గీయులు వెంటనే హుటాహూటిన కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. దీంతో, ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో తెలంగాణా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు బలప్రదర్శనకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు TNGO అధ్యక్షుడు అఫ్జల్ హసన్ వర్గీయులు.


Also read: పడి లేచిన కెరటం రేవంత్‌రెడ్డి.. ఆయన జీవితం పోరాటాల పాఠం!

కాగా, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు పేరు ఉన్నప్పటికీ వరుసగా 2014, 2018 ఎన్నికల్లో ఓటములతో తెలంగాణ కాంగ్రెస్ డీలా పడింది. పార్టీ కేడర్‌లో నైరాశ్యం, కార్యకర్తల్లో నిరుత్సాహం నిండిన స్థితి నుంచి నేడు హస్తం పార్టీ ఏకంగా అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ కథ ముగిసిందంటూ విస్తృత చర్చలు, బీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయమనేలా రాజకీయ ముఖచిత్రం మారిపోయిన పరిస్థితిలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం మరింత ఆసక్తి కరంగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు