1.రేవంత్‌రెడ్డి, సీఎం, కొడంగల్
---------------------
2006లో మిడ్జిల్ జడ్పీటీసీ సభ్యుడిగా విజయం
2007లో మహబూబ్‌నగర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక
2009లో టీడీపీ తరపున కొడంగల్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపు
2014-2017వరకు టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్
2018 అక్టోబర్‌లో టీడీపీకి రాజీనామా
2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం
2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా గెలుపు
2021జూన్ 26న టీపీసీసీ చీఫ్‌గా నియామకం
2021జులై 7న టీపీసీసీ చీఫ్‌గా ప్రమాణస్వీకారం
ఈ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్‌రెడ్డి
2.భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం, మధిర
----------------
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ హయాం నుంచే పార్టీలో చురుగ్గా ఉన్న భట్టి
2007-2009వరకు ఎమ్మెల్సీగా విధులు
2009-2011వరకు చీఫ్ విప్
2011-2014వరకు డిప్యూటీ స్పీకర్
2018లో సీఎల్పీ నేతగా ఎన్నికైన భట్టి
2009, 2014, 2018, 2023లో మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
పీపుల్స్ మార్చ్ పేరుతో 1360 కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్ర
ఇది కూడా చదవండి: తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్.. నేడు సాయంత్రం 5 గంటలకు కేబినెట్ భేటీ!
3.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, హుజూర్‌నగర్
----------------
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా పనిచేసిన ఉత్తమ్
1999, 2004లో కోదాడ నుంచి గెలుపు
2009,2014, 2018లో హుజూర్‌నగర్ నుంచి విజయం
2019లో నల్గొండ నుంచి ఎంపీగా గెలుపు
2015 మార్చి-2021 జూన్ వరకు టీపీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్
కిరణ్ కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ఉత్తమ్
2019లో నల్గొండ నుంచి ఎంపీగా ఎన్నిక
4.పొన్నం ప్రభాకర్, హుస్నాబాద్
-----------------
విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో కీలకపాత్ర
కరీంనగర్ నుంచి 2009లో ఎంపీగా గెలుపు
2018లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం
2022లో తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియామకం
2014, 2019లో కరీంనగర్ లోక్‌సభ నుంచి ఓటమి
2018లో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం
2023లో హుస్నాబాద్ నుంచి గెలిచిన పొన్నం ప్రభాకర్
5.శ్రీధర్ బాబు, మంథని
----------------------
శ్రీపాదరావు వారసునిగా రాజకీయాల్లోకి ఎంట్రీ
మంథని నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు
1999, 2004, 2009, 2018, 2023లో ఎమ్మెల్యేగా విజయం
కాంగ్రెస్‌లో పలు కీలక పదవులు నిర్వహించిన శ్రీధర్‌బాబు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు శాఖల్లో మంత్రిగా పనిచేసిన అనుభవం
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసిన శ్రీధర్‌బాబు
తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న శ్రీధర్‌బాబు
6.సీతక్క, ములుగు
------------------
విద్యార్థి దశ నుంచే పోరాట జీవితం
14ఏళ్లకే నక్సలిజంలో చేరిన అనసూయ
15ఏళ్లకు పైగా మావోయిస్టుగా పోరాటం
పెళ్లయ్యాక అనసూయ నుంచి సీతక్కగా పేరు మార్పు
దళంలో మారిన సిద్ధాంతాలతో పొసగలేక 1996లో జనజీవన స్రవంతిలోకి
ఐటీడీఏలో ఉద్యోగం చేస్తూ లా చదివిన సీతక్క
2009లో టీడీపీ తరపున ములుగు నుంచి గెలుపు
టీడీపీకి రాజీనామా చేసి 2017లో కాంగ్రెస్‌లో చేరిన సీతక్క
2019లో మరోసారి ములుగు ఎమ్మెల్యేగా జయకేతనం
2023లో కాంగ్రెస్ నుంచి మరోసారి విజయం సాధించిన సీతక్క
7.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్గొండ
---------------------
నల్గొండ నుంచి 5సార్లు ఎమ్మెల్యేగా గెలుపు
1999, 2004, 2009, 2014, 2013లో విజయం
వైఎస్‌ఆర్, రోశయ్య మంత్రివర్గాల్లో ఐటీ, క్రీడల మంత్రిగా..
కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మౌలికవసతులు, పెట్టుబడులు, రేవులశాఖ మంత్రిగా పనిచేసిన వెంకట్‌రెడ్డి
2019లో భువనగిరి ఎంపీగా గెలిచిన వెంకట్‌రెడ్డి
ఈ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
8.కొండా సురేఖ, వరంగల్ ఈస్ట్
---------------------
1999లో శాయంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక
శాయంపేట, పరకాల, వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
2004లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా..
2009లో పరకాల ఎమ్మెల్యేగా గెలుపు
వైఎస్‌ఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ
2014ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌లో చేరిన సురేఖ
2014లో బీఆర్‌ఎస్ నుంచి వరంగల్ తూర్పులో ఎమ్మెల్యేగా గెలుపు
2018లో బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన సురేఖ..
2018లో పరకాల నుంచి ఓటమి
2023లో కాంగ్రెస్ తరపున వరంగల్ తూర్పు నుంచి గెలుపు
9.పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పాలేరు
------------------
2014లో వైసీపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నిక
ఆ తర్వాత వైసీపీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు
6నెలల క్రితం బీఆర్‌ఎస్‌కు రాజీనామా
ఈ ఏడాది జులై 2న రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
10.తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం
----------------------
టీడీపీలో సుదీర్ఘ కాలం పనిచేసిన తుమ్మల
1985లో సత్తుపల్లి నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపు
1985, 1994, 1999, 2009లో టీడీపీ నుంచి గెలుపు
2014లో బీఆర్‌ఎస్‌లో చేరిన తుమ్మల
2015లో మండలికి..2016లో పాలేరు నుంచి ఎమ్మెల్యేగా విజయం
2018లో పాలేరు నుంచి పోటీ చేసి ఓటమి
2003 సెప్టెంబర్ 14న బీఆర్‌ఎస్‌కు రాజీనామా
కాంగ్రెస్‌లో చేరి ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ కేబినెట్‌లలో మంత్రిగా సేవలు
11.జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్
----------------------
కొల్లాపూర్ నుంచి వరుసగా ఐదుసార్లు ఎన్నికైన మొదటి ఎమ్మెల్యే
1999, 2004, 2009, 2012 ఉప ఎన్నికలు, 2014లో గెలుపు
వైఎస్‌ఆర్, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా సేవలు
2011అక్టోబర్ 30న కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిక
2014లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి విజయం
కేసీఆర్ మంత్రివర్గంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు
2018లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి
2023 ఏప్రిల్ 10న జూపల్లిని సస్పెండ్ చేసిన బీఆర్‌ఎస్
ఈ ఏడాది కాంగ్రెస్ గూటికి చేరి మరోసారి కొల్లాపూర్ నుంచి గెలుపు
12.దామోదర రాజనర్సింహ, అందోలు
--------------------------
1989లో తొలిసారిగా మెదక్ జిల్లా అందోలు నుంచి గెలుపు
2006,2009లోనూ అందోలు నుంచి అసెంబ్లీకి ఎన్నిక
వైఎస్‌ఆర్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లలో మంత్రిగా సేవలు
2011 జూన్ 10న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం పదవి
2023 ఆగస్ట్ 20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియామకం
ఈ ఎన్నికల్లో అందోలు నుంచి పోటీ చేసి మరోసారి విజయం