/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CM-Revanth-Reddy-3-jpg.webp)
CM Revanth Reddy Swearing Ceremony: తెలంగాణ కాంగ్రెస్ నేతలు మల్లు రవి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, రోహిన్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ తమిళిసైని కోరారు. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నామని, ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు అందించారు. గురువారం సీఎం, కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని, ఇందుకు సంబంధించి అధికారిక ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. గురువారం మధ్యాహ్నం 1.4 నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేందుకు గవర్నర్ ఏర్పాట్లు చేస్తామని చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు పంపారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా అనేక మంత్రి ఆహ్వానాలు పంపించారు రేవంత్ రెడ్డి. మరి ఆహ్వానాలు ఎవరెవరికి వెళ్లాలో ఓసారి చూద్దాం..
రేవంత్ ఆహ్వానాలు అందుకున్న అతిథులు వీరే..
☞ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
☞సోనియా గాంధీ
☞రాహుల్ గాంధీ
☞ప్రియాంక గాంధీ
☞లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమారి
☞కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
☞కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
☞హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్
☞బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్
☞పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
☞తమిళనాడు సీఎం స్టాలిన్
☞ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్
☞తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్
☞ఏపీ మాజీ చంద్రబాబు నాయుడు
☞మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం
☞రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్
☞మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్
☞మాజీ కేంద్రమంత్రి వీరప్ప మొయిలి
☞మాజీ కేంద్రమంత్రి కుంతియా
☞భుపేష్ భాఘల్
☞అశోక్ చవాన్
☞వి. రవి
☞సుశీల్ కుమార్ షిండే
☞మాణిక్కం ఠాగూర్
☞కురియన్
☞బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
☞సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
☞తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
☞ప్రొఫెసర్ కంచె ఐలయ్య
☞ప్రొఫెసర్ హరగోపాల్
☞తెలంగాణ ఉద్యమ నాయకుడు గాదె ఇన్నయ్య
☞అన్ని పార్టీల అధినేతలకు, పలువురు సినీ ప్రముఖులకూ, తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు.
Also Read:
ఆ పదవికి రాజీనామా చేయనున్న రేవంత్ రెడ్డి..!
హమ్మయ్య.. రికార్డ్ స్థాయిలో తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..