TS New Cabinet: ఆ 13 మందికి కేబినెట్ లో నో ఛాన్స్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హైకమాండ్!

మరి కొన్ని గంటల్లో సీఎం ప్రమాణ స్వీకారం ఉండగా.. ఇంత వరకు మంత్రుల పేర్లను హైకమాండ్ ఖరారు చేయలేదు. ఇప్పటికే ఫైనల్ చేసిన లిస్ట్ నుంచి 13 మంది పేర్లను అధిష్టానం పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.

New Update
TS New Cabinet: ఆ 13 మందికి కేబినెట్ లో నో ఛాన్స్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హైకమాండ్!

తెలంగాణ సీఎంగా రేపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అయితే.. మంత్రి వర్గ కూర్పుపై హైకమాండ్ ఇంకా తేల్చలేదని తెలుస్తోంది. రేపు ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల లిస్ట్ లో ఎవరుంటారనే అంశంపై క్షణం క్షణం ఉత్కంఠ సాగుతోంది. చివరి నిమిషంలో మారుతున్న పేర్లు, శాఖలు మారుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్లతో చర్చల తర్వాత మంత్రివర్గంలో భారీ మార్పులు చేస్తోంది హైకమాండ్. హైదరాబాద్‌ బయలుదేరిన రేవంత్‌ను ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పిలిచి మరీ చర్చిస్తోంది హైకమాండ్. దీంతో మొదట ఊహించిన దానితో పోలిస్తే కేబినెట్ లో భారీ మార్పులు ఉంటాయని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: New CM Revanth Reddy: రేపు ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం.. అందరికీ ఆహ్వానం.. రేవంత్ సంచలన లేఖ

మొదట ఖారారు చేసిన పేర్లలో 11 మందిని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలను బేరీజు వేస్తూ అన్నివర్గాలను సంతృప్తి పరిచేలా కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా కొండా సురేఖ, దామోదర్‌ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, జి.వివేక్‌, సుదర్శన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, పొన్నం ప్రభాకర్‌, షబ్బీర్‌ అలీ, ప్రేమ్‌సాగర్‌రావు, మదన్‌మోహన్‌రావు పేర్లలో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు