తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageshwar Rao) ఈ రోజు కీలక ప్రకటన చేశారు. రైతుభరోసా, పంటలభీమా, రుణమాఫీ పథకం విధివిధానాలపై ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసినట్లు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి (TS CM Revanth Reddy) ఆదేశానుసారం రైతు భరోసా, పంటల భీమా అమలు చేయడానికి అవసరమైన నిధుల గురించి ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో తుమ్మల ఈ రోజు చర్చించారు. పంటరుణాలు రికవరీ కోసం రైతులను ఇబ్బంది పెట్టొద్దని పరపతి సంఘాలకు, బ్యాంకులను మంత్రి కోరారు.
ఇది కూడా చదవండి: Apoori Somanna: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఏపూరి సోమన్న!
వచ్చే వానాకాలనికి సంబంధించి ఎరువులు, విత్తనాలను ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులకు తీసుకువచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర అందేవిధంగా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పండ్ల పక్వానికి కార్బైడ్ ప్రయోగించే వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం మార్క్ ఫెడ్ ద్వారా అన్ని రకాల పంటలు (మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగ, జొన్న) కొనుగోలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు.