తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadeesh Reddy) అదిరిపోయే శుభవార్త చెప్పారు. 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ (Telangana Job Notification) విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. టీఎస్ఎస్పీడీసీఎల్ లో నూతనంగా జూనియర్ లైన్ మెన్ గా నూతనంగా నియమితులైన 1362 మందికి మంత్రి నియామక పత్రాలను అందజేశారు. శనివారం రాత్రి ఎస్ఆర్ నగర్ లోని జెన్కో ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో విద్యుత్ రంగంలో 35,774 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. అందులో ఔట్ సోర్సింగ్ ద్వారా టీఎస్ఎస్పీడీసీఎల్ నియమించిన 10,312, ట్రాన్స్ కోలో 4,403, జెన్కో లో 3,689, ఎన్పీడీసీఎల్ లో 4,370 మొత్తం కలిపి 22,774 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని వివరించారు.
ప్రత్యక్ష నియామకాల ద్వారా 13,000 మందిని నియమించుకున్నామన్నారు జగదీశ్ రెడ్డి. ఇవి కాకుండా మరో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు 1.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. ఇంకా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కరెంట్ పీక్ డిమాండ్ 5,661 మేఘావాట్లు ఉందన్నారు.
Ts govt jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్న్యూస్…ఈ శాఖలో 8 వేల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్..!!
అది ఇప్పుడు 174 శాతానికి పెరగడంతో 15,497 మేగా వాట్లకు చేరిందని సంతోషం వ్యక్తం చేశారు. అదే విదంగా తలసరి విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణా రికార్డ్ సృష్టించిందన్నారు జగదీశ్ రెడ్డి. జాతీయ సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,255 యూనిట్లు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 2,126 యూనిట్లుగా రికార్డు కావాడమే అందుకు నిదర్శనమన్నారు.
దేవంలోనే నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా మాత్రమేనని మంత్రి అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసేది కేవలం ఆరు గంటలు మాత్రమేనని విమర్శించారు. విద్యుత్ రంగం విజయాలలో లైన్ మెన్ ల పాత్ర కీలకంగా ఉంటుందన్న విషయాన్ని కొత్తగా నియమితులైన ఉద్యోగులు విస్మరించరాదని దిశానిర్దేశం చేవారు. రక్షణ చర్యలు తీసుకుంటూ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు జగదీశ్ రెడ్డి