TS Mega DSC 2024: తెలంగాణ మెగా డీఎస్సీ...ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయి..పూర్తి వివరాలివే.!

తెలంగాణలో నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ పరీక్షలు మే/జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. జిల్లాల వారీగా ఉద్యోగ ఖాళీలను తెలుసుకోండి.

TS Mega DSC 2024: తెలంగాణ మెగా డీఎస్సీ...ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయి..పూర్తి వివరాలివే.!
New Update

TS Mega DSC 2024:  11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. నిన్న పాత నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 11,062 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో 6,508 సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT), 2,629 స్కూల్ అసిస్టెంట్లు (SA), 727 లాంగ్వేజ్ పండిట్లు (LP), 182 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PET), 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 220 పోస్టులు, 79 SA క్యాడర్ కింద ఖాళీలు ఉంటాయి. ఈ పోస్టులలో గత బీఆర్‌ఎస్‌ (BRS) ప్రభుత్వం నోటిఫై చేసిన 5,089 ఖాళీలు కూడా ఉన్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, విద్యాశాఖ అధికారులతో కలిసి నోటిఫికేషన్ జారీ చేశారు సీఎం.

ఈ ఉద్యోగాలకు మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్ లైన్ అప్లికేషన్స్ స్వీకరించనున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ లో 878 ఖాళీలు ఉండగా. నల్లగొండలో 605, నిజామాబాద్ 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 ఖాళీలను భర్తీ చేస్తారు. జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఖాళీలను పీడీఎఫ్ లో చూడవచ్చు.

ఇది కూడా చదవండి: రష్యా సైన్యంలో 20-30 మంది భారతీయులు చిక్కుకుపోయారు: విదేశాంగ శాఖ

124040817-file  ఈ పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ చూసి చూడవచ్చు. 

publive-image publive-image

#ts-dsc-2024 #ts-mega-dsc-2024 #district-wise-posts
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe