Telangana BJP : మోదీతో రఘునందన్‌ ముచ్చట.. ఆ లోక్‌సభ సీటు కోసమేనా?

బీజేపీ విజయ సంకల్పయాత్ర బహిరంగసభ వేదికపై మోదీతో రఘునందన్‌ మాట్లాడారు. మెదక్‌ లోక్‌సభ టికెట్‌ తనకు కేటాయించాలని రఘునందన్‌ కోరినట్టుగా తెలుస్తోంది. దీనికి 'ఆల్‌ ద బెస్ట్‌..గో ఏ హెడ్‌' అని రఘునందన్‌కు మోదీ క్లారిటీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

New Update
Telangana BJP : మోదీతో రఘునందన్‌ ముచ్చట.. ఆ లోక్‌సభ సీటు కోసమేనా?

Raghunandan With Modi : ప్రధాని మోదీ(PM Modi) తెలంగాణ(Telangana) పర్యటన టీ.బీజేపీ(T BJP) నేతల్లో మంచి జోష్‌ నింపింది. మోదీ ప్రసంగం ఇటు తెలంగాణ ప్రజలను సైతం ఆకట్టుకుంది. రేవంత్‌(Revanth) తో ఫ్రెండ్లీగా ఉంటూనే మోదీ కాంగ్రెస్‌(Congress), బీఆర్‌ఎస్‌(BRS) కు తనదైన శైలిలో విమర్శించారు. ఇక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక మోదీ పటాన్‌చెరు సభలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ విజయ సంకల్పయాత్ర బహిరంగసభ వేదికపై మోదీతో రఘునందన్‌(Raghunandan) మాట్లాడారు. మెదక్‌ లోక్‌సభ టికెట్‌(Medak Lok Sabha Ticket) తనకు కేటాయించాలని రఘునందన్‌ కోరినట్టుగా తెలుస్తోంది. ఆల్‌ ద బెస్ట్‌..గో ఏ హెడ్‌ అని మోదీ క్లారిటీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల 9 మంది ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. అటు మెదక్‌ సీటు పెండింగ్‌లో ఉంది.. ఈ క్రమంలోనే మెదక్ నుంచి తాను పోటీ చేస్తానని రఘునందన్ కోరారట.

టీఆర్‌ఎస్‌ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు రఘునందన్‌. 2001 నుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్నారు. ఆయన అప్పుడు పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. ఇక మెదక్ జిల్లా కన్వీనర్‌గా కూడా సేవలందించారు. మే14, 2013లో రఘునందన్‌ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారనే ఆరోపణలపై టీఆర్‌ఎస్‌ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. . ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన రఘునందన్‌ కొద్ది రోజులకే పార్టీకి రాజీనామా చేసి, BJPలో చేరారు. 2014లో దుబ్బాక నియోజకవర్గం నుంచి శాసనసభ ఎన్నికలలో పోటీ చేశారు. ఇక రామలింగారెడ్డి మరణానంతరం దుబ్బాక(2020)లో జరిగిన ఉప ఎన్నికలో 1,074 ఓట్ల తేడాతో గెలిచారు.

బంగారు శృతికి ఓకే?
మరోవైపు ఇదే వేదికపై ప్రధానిని కలిసి అభివాదం చేశారు బంగారు శృతి. మోదీతో శృతి మాట్లాడారు. ఢిల్లీకి వచ్చి కలిసేందుకు సమయం ఇవ్వాలని శృతి కోరారు. శృతికి మోదీ ఓకే చెప్పారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ నాగర్‌ కర్నూల్‌ టికెట్‌ ఆశించి బంగారు శృతి భంగపడ్డ విషయం తెలిసిందే. ఆ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డిని శృతి కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంతలోనే మోదీతో సభలో శృతి పాల్గొనడం ఆసక్తిని రేపుతోంది.
Also Read: నది కింద మెట్రో..భారత్ మరో అద్భుతం..నేడే ప్రారంభం

Advertisment
తాజా కథనాలు