Kumuram Bheem Asifabad : తెలంగాణలో రుణమాఫీ (Rythu Runa Mafi) కాక కొందరు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు కారణం అధికారుల నిర్లక్ష్యమేనని స్పష్టంగా తెలుస్తోంది. కుమరం భీమ్ జిల్లా రెబ్బెన సహకార సంఘం కోఆపరేటివ్ బ్యాంకులో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటపడుతున్నాయి. వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి.
Also Read: రుణమాఫీ కానివాళ్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..!
చనిపోయిన వ్యక్తుల పేర్లపై లోన్లు (Loans) రెన్యువల్ చేసినట్లు తెలుస్తోంది. రైతులు గతంలో తీసుకున్న లోన్లు కట్టినా అధికారులు రికార్డుల్లో చెల్లించినట్లుగా నమోదు చేయకపోవడంతో అప్పులు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు గతంలో తీసుకున్న లోన్లు కట్టినా అప్పులు చూపించడంతో రుణమాఫీ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సహకార సంఘం కోఆపరేటివ్ బ్యాంకు అధికారులు రూ. కోట్లల్లో అక్రమాలకు పాల్పడ్డారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై విచారణకు కలెక్టర్ ఆదేశించగా అక్రమాలకు పాల్పడినట్లు అసలు విషయం బయటపడింది. ఒక అధికారిని సస్పండ్ చేశారు.