Inter Supplementary Exam Fees : ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్‌ ఫీజు గడువు పెంపు!

తెలంగాణలో ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించే గడువును ఇంటర్‌ బోర్డు పెంచింది. నిజానికి ఈ గడువు మే 2 తో ముగియాల్సి ఉండగా..మరో రెండు రోజులు అంటే మే 4వరకు పొడిగించింది. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీజు చెల్లించాలని విద్యాశాఖాధికారులు తెలిపారు .

New Update
TG DSC: నేడే తెలంగాణ డీఎస్సీ పరీక్షలు.. 10 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల్లోకి!

Inter Exams : తెలంగాణ(Telangana) లో ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్ష(Inter Supplementary Exams) ల ఫీజు చెల్లించే గడువును ఇంటర్‌ బోర్డు(Inter Board) పెంచింది. నిజానికి ఈ గడువు మే 2 తో ముగియాల్సి ఉండగా.. మరో రెండు రోజులు అంటే మే ల వరకు పొడిగించింది. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వెంటనే పరీక్ష ఫీజు(Exam Fees) చెల్లించాలని విద్యాశాఖాధికారులు తెలిపారు . విద్యార్థులకు కాలేజీలో ఫీజు చెల్లించేందుకు మే 4 వరకు, ప్రిన్సిపల్స్ ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు మే 5 వరకు గడువు విధించారు.

మే 24 నుంచి జూన్ 3 వరకు ఇంట‌ర్ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మొదటి సంవత్సరం పరీక్షలు, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వ‌ర‌కు రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించ‌నున్నారు.

సప్లిమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్‌ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా రూ.460, ప్రాక్టికల్స్‌కు రూ.170, బ్రిడ్జి కోర్సులకు రూ.120 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూవ్‌మెంట్‌ కోసం పరీక్ష ఫీజుతో పాటు ఒక్కో పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలి. మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకుంటే.. సైన్స్‌ విద్యార్థులు రూ.1200, ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.1050 చెల్లించాల్సి ఉంటుంది.

Also read: చీటికి మాటికి వచ్చే కోపం వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి..జాగ్రత్త!

Advertisment
తాజా కథనాలు