తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. పలువురు అధికారుల బదిలీలు.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కీలక స్థానాల్లో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమించింది ప్రభుత్వం. ట్రాన్స్ కో, జెన్ కో చైర్మన్ అండ్ ఎండీగా రిజ్విని నియమించింది. By Shiva.K 14 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana IAS Officers Transferred: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ట్రాన్స్ కో, జెన్ కో చైర్మన్ అండ్ ఎండీగా రిజ్విని నియమించింది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమించారు. డిప్యూటీ సీఎం ఓఎస్‌డీగా కృష్ణ భాస్కర్‌ను నియమించారు. అగ్రికల్చర్ డైరెక్టర్‌గా డాక్టర్ బి గోపి ని నియమించారు. IAS transfers #Telangana Amrapali Kata - Joint Metropolitan Commissioner HMDA and FAC MRDCL Syed Rizvi - Energy secretary Musharraf Ali Faruqui - CMD TSSPDCL Karnati Varun Reddy - CMD TSNPDCL Krishna Bhaskar -OSD to deputy CM Sandeep Kumar Jha - JMD Transco B Gopi -… pic.twitter.com/eV8FGP7SHX — Naveena (@TheNaveena) December 14, 2023 ప్రభుత్వం బదిలీ చేసిన అధికారుల వివరాలు, పోస్టింగ్ ల వివరాలివే.. తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లకు కీలక బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి రెండు కీలక బాధ్యతలు అప్పగించారు. హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా, మూసీ రివర్ బోర్డ్ ఎండీగా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఆమ్రపాలి 2010 ఐఏఎస్ బ్యాచ్ అధికారిణి. ఇక ఇంధన శాఖ కార్యదర్విగా రిజ్వీని నియమించింది. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే, ట్రాన్స్‌కో జేఎండీగా సందీప్‌కుమార్ జా, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణభాస్కర్, SPDCL సీఎండీగా ముష్రఫ్ అలీ, NPDCL సీఎండీగా కర్నాటి వరుణ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా బి.గోపి ని నియమించింది ప్రభుత్వం. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. Also Read: ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ ఎప్పుడు? కీలక అప్‌డేట్స్ మీకోసం.. సీఎం పర్యటనలో అపశృతి.. హెలీప్యాడ్ వద్ద కుప్పకూలిన ధర్మాన కృష్ణదాస్ తనయుడు.. #telangana #cm-revanth-reddy #telangana-ias-officers-transferred మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి