Chandrababu: చంద్రబాబుకు తెలంగాణ పోలీసుల షాక్.. కేసు నమోదు!

నిన్న విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు స్థానిక టీడీపీ నేతలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికిన విషయం తెలిసిందే. అయితే.. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారన్న కారణంతో పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

New Update
Chandrababu: చంద్రబాబుకు తెలంగాణ పోలీసుల షాక్.. కేసు నమోదు!

ఏపీ సీఐడీ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు (Chandrababu Naidu) తాజాగా తెలంగాణ పోలీసులు (Telangana Police) షాక్ ఇచ్చారు. నిన్న చంద్రబాబు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వరకు టీడీపీ శ్రేణులు, అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించి సందడి చేశారు. దీంతో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారన్న ఆరోపణలతో కేసు నమోదు చేశారు పోలీసులు. సబ్ ఇన్స్పెక్టర్ జయచందర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. దాదాపు రెండు గంటల పాటు న్యూసెన్స్ క్రియేట్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఐపీసీ 341, 290, 341, 21 రెడ్ విత్ 76 పీసీ యాక్ట్ కేసును బుక్ చేశారు పోలీసులు. దీంతో టీడీపీ హైదరాబాద్ సిటీ జనరల్ సెక్రటరీ జీవీజీ నాయుడుతో పాటు పలువురు నేతలపై కేసలు నమోదయ్యాయి. ర్యాలీలో మొత్తం 400 మంది పాల్గొన్నారని పోలీసులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu: ఫైబర్ గ్రిడ్ కేసులో దూకుడు పెంచిన సీఐడీ

ఈ రోజు చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రులకు వెళ్లనున్నారు. నిన్న ఏఐజీ హాస్పటల్ వైద్యులు చంద్రబాబును కలిశారు. వారి సూచన మేరకు నేడు ఏఐజీకి చెకప్ కోసం బాబు వెళ్ళనున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం.. వైద్య పరీక్షల నివేదికలను ఏసీబీ కోర్టుకు చంద్రబాబు సమర్పించనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు