Telangana High Court: కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త తెలంగాణ హైకోర్టు కొత్త భవన నిర్మాణంపై కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త తెలంగాణ హైకోర్టు భవనం కొరకు 100 ఎకరాల భూమి రేవంత్ సర్కార్ కేటాయించింది. రాజేంద్ర నగర్ బుద్వేల్, ప్రేమావటిపేటలో స్థలం కేటాయిస్తూ జీవో 55ను విడుదల చేసింది. అయితే.. కొత్త భవనం నిర్మాణం జరిగే వరకు హైకోర్టు కార్యకలాపాలు పాత భవనంలోనే జరగనున్నాయి. ఆ తర్వాత హెరిటేజ్ భవనంగా పరిరక్షించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఈ పాత భవనాన్ని సిటీ కోర్టుకు లేదా వేరే ఏదైనా కోర్టు భవనానికి వాడుకోవాలని ఇదివరకే చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
ALSO READ: YS Sharmila: అక్కడి నుంచే షర్మిల పోటీ?
డిసెంబర్ నెలలో సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఎంసీహెచ్‌ఆర్‌డీలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుతం ఉన్న తెలంగాణ హైకోర్టు భవనం పరిస్థితి గురించి సీఎం రేవంత్ కు వారు వివరించారు. ఇప్పుడు ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకుందని.. కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ హైకోర్టు కొత్త భవనం ఏర్పాటు చేస్తామని వారి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది.