/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/TS-High-Court-jpg.webp)
BRS MLC : ఆదిలాబాద్(Adilabad) స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా దండె విఠల్(Dande Vithal) ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు(Telangana High Court) సంచలన తీర్పును వెల్లడించింది. ఆయనపై కాంగ్రెస్(Congress) అభ్యర్థిగా పోటీ చేసిన పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోర్జరీ సంతకాలతో తాను నామినేషన్ ఉపసంహరించుకున్నట్లుగా రిటర్నింగ్ ఆఫీసర్ కు పత్రాలు ఇచ్చారని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఆయన ఎన్నికను రద్దు చేయడంతో పాటు, రూ.50 వేల జరిమానా కూడా విధించింది. దండె విఠల్ ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2022లో ఎన్నికయ్యారు. రెండేళ్ల పదవీకాలం కూడా పూర్తికాకుండానే ఆయన ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది. దీతో విఠల్ నెక్ట్స్ ఏం చేస్తారన్న అంశం చర్చనీయాంశమైంది. ఈ తీర్పుపై ఆయన అప్పీలుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.