Telangana High Court Lawyer : ప్రేమ(Love), పెళ్ళి(Marriage), రొమాన్స్(Romance), ఇంటి పనులు ఇలాంటి వాటన్నింటికీ ఆడవాళ్ళు(Women's) కావాలి కానీ పిల్లలుగా మాత్రం ఆడపిల్లలు వద్దు. దేశం ఎంత ముందుకు వెళుతున్నా ఈ వెనుకబాటు ఆలోచన మాత్రం ఇంకా చాలా మందిలో నాటుకుపోయే ఉంది. ఒక పక్క ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకువెళుతూ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుంటే కొందరు మాత్రం వంశోద్ధారకుడు, కొడుకు అంటూ అక్కడే పడి చస్తున్నారు. ఈ కాలంలో కూడా, నేరం అని తెలిసి కూడా కడుపులో ఉన్నది ఆడపిల్లలు అయితే అబార్షన్‌లు(Abortion) చేయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్(Hyderabad) లో ఇలాంటి సంఘటనే ఒకటి బయటపడింది. తన భార్య కడుపులో ఉన్నది ఆడపిల్లలు అని తెలిసి నాలుగు సార్లు అబార్షన్ చేయించడమే కాకుండా.. మరో పెళ్ళి కూడా చేసుకున్నాడు. ఈ అన్యాయం చేసింది న్యాయాన్ని కాపాడవలసిన న్యాయవాది. అతని తండ్రి కూడా రిటైర్డ్ జడ్జి కావడం విషాదం.
లాయర్ కాదు... క్రిమినల్..
హైదరాబాద్‌కు చెందిన అమరేందర్ హైకోర్టు అడ్వకేటు. ఇతని తండ్రి మహేందర్ రిటైర్డ్ జడ్జి. కొడుక్కే బుద్ధి లేదనుకుంటే... ఆ తండ్రికి అంతకంటే బుద్ధి లేదు. కొడుకు చేస్తున్న దుర్మార్గాలని ఆపకుండా ప్రోత్సహించాడు. అమరేందర్ మీద సరూర్ నగర్ పోలీస్ స్టే షన్‌లో ఫిర్యాదు నమోదయింది. ఇతని బారిన ఒకరే కాదు పలువురు పడ్డారు. బాధితులు, అమరేందర్ భార్య కంప్లైంట్ చేశారు. తన భర్త తనకు ఆడపిల్లలు పుడుతున్నారని రెండో పెళ్ళి చేసుకున్నాడని చెబుతోంది అమరేందర్ భార్య.
Also Read : Hyderabad: కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన యువతితో ఎస్ఐ ప్రేమ.. ఆపై అత్యాచారం!
ఆడపిల్లలు వద్దు..
అమరేందర్‌కు ఇద్దరు ఆడపిల్లులు ఉన్నారు. మూడో సంతానంగా మగపిల్లవాడు కావాలనుకున్నాడు. దాని కోసం భార్యను బలి చేశాడు. నాలుగుసార్లు అక్రమంగా భార్యకు స్కానింగ్ చేయించడమే కాక, అందులో ఆడపిల్లని తెలియడంతో అబార్షన్ కూడా చేయించాడు అమరేందర్. అక్కడితో ఆగకుండా రెండో పెళ్ళి కూడా చేసుకున్నాడు ఈ లాయర్ ప్రబుద్ధుడు. గత ఏడాది సిద్ధిపేటలో రెండో పెళ్ళి చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అమరేందర్ భార్య. పైగా తాను చనిపోయానని చెప్పాడని కూడా చెబుతోంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటోంది. అయితే అమరేందర్ తన భార్యకు ఎక్కడ స్కానింగ్ చేయించాడు, అబార్షన్ చేయించాడు ...దానికి ఎవరు సహకరించారు అన్నదాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమరేందర్‌కు రాజకీయాల్లో కూడా జోక్యం ఉందని చెబుతున్నారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్‌గా మారిన తర్వాత అమరేందర్ తెలంగాణ రైతు రాజ్య సమితి పేరుతో పార్టీని రిజిస్టర్ చేయించుకున్నట్టు చెబుతున్నారు.
Also Read : Andhra Pradesh:వైసీపీకి బిగ్ షాక్..పార్టీకి గుమ్మనూరు గుడ్ బై