ఐఏఎస్, ఐపీఎస్ ల కేడర్ వివాదంపై హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణ, ఏపీల మధ్య ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ వివాదంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రత్యూషసిన్హా కమిటీ మార్గదర్శకాల ప్రకారమే కేడర్ ను కేటాయించాలని కోర్టు స్పష్టం చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ ల అభ్యంతరాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది.

Danam Disqualification: అనర్హత వేటు పిటిషన్‌..స్పీకర్, కార్యదర్శి,దానం నాగేందర్‎కు హైకోర్టు నోటీసులు.!
New Update

తెలంగాణ, ఏపీల మధ్య ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ వివాదంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రత్యూషసిన్హా కమిటీ మార్గదర్శకాల ప్రకారమే కేడర్ ను కేటాయించాలని కోర్టు స్పష్టం చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ ల అభ్యంతరాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది. ఐఏఎస్, ఐపీఎస్ లు తమ అభిప్రాయాలను DOPT కి చెప్పుకునే అవకాశం కల్పించింది న్యాయస్థానం. రాష్ట్ర విభజన సమయంలో 14 మంది ఐఏఎస్, ఐపీఎస్ లను DOPT తెలంగాణ, ఏపీకి  కేటాయించింది. ఆ ఉత్తర్వులను క్యాట్ కొట్టివేసింది. క్యాట్ తీర్పును హైకోర్టులో కేంద్రం సవాల్ చేసింది. ప్రత్యూష సిన్హా మార్గదర్శకాలను సమర్ధించింది న్యాయస్థానం. క్యాట్ తీర్పును కొట్టేసింది. ఐఏఎస్, ఐపీఎస్ ల సినియారిటీ, స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అప్పటివరకు అధికారులు ఇప్పుడు ఉన్న పోస్టుల్లోనే కొనసాగాలని తెలిపింది.

ఈ వార్త అప్డేట్ అవుతోంది..

#high-court #ias #ips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe