ఐఏఎస్, ఐపీఎస్ ల కేడర్ వివాదంపై హైకోర్టు కీలక తీర్పు తెలంగాణ, ఏపీల మధ్య ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ వివాదంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రత్యూషసిన్హా కమిటీ మార్గదర్శకాల ప్రకారమే కేడర్ ను కేటాయించాలని కోర్టు స్పష్టం చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ ల అభ్యంతరాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది. By Nikhil 03 Jan 2024 in తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ, ఏపీల మధ్య ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ వివాదంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రత్యూషసిన్హా కమిటీ మార్గదర్శకాల ప్రకారమే కేడర్ ను కేటాయించాలని కోర్టు స్పష్టం చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ ల అభ్యంతరాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది. ఐఏఎస్, ఐపీఎస్ లు తమ అభిప్రాయాలను DOPT కి చెప్పుకునే అవకాశం కల్పించింది న్యాయస్థానం. రాష్ట్ర విభజన సమయంలో 14 మంది ఐఏఎస్, ఐపీఎస్ లను DOPT తెలంగాణ, ఏపీకి కేటాయించింది. ఆ ఉత్తర్వులను క్యాట్ కొట్టివేసింది. క్యాట్ తీర్పును హైకోర్టులో కేంద్రం సవాల్ చేసింది. ప్రత్యూష సిన్హా మార్గదర్శకాలను సమర్ధించింది న్యాయస్థానం. క్యాట్ తీర్పును కొట్టేసింది. ఐఏఎస్, ఐపీఎస్ ల సినియారిటీ, స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అప్పటివరకు అధికారులు ఇప్పుడు ఉన్న పోస్టుల్లోనే కొనసాగాలని తెలిపింది. ఈ వార్త అప్డేట్ అవుతోంది.. #high-court #ias #ips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి