జన్వాడ ఫాంహౌస్ కూల్చివేత.. హైడ్రాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

జన్వాడ ఫాంహౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వాలంటూ ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాను ఆదేశించింది. ఫాంహౌస్ కు సంబంధించిన అన్ని పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.

New Update
జన్వాడ ఫాంహౌస్ కూల్చివేత.. హైడ్రాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

కూల్చివేతలపై హైడ్రాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జన్వాడ ఫాంహౌస్ కూల్చివేతను ఆపాలని ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. జన్వాడ ఫామ్‌హౌస్‌ కూల్చివేతపై జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాకు ఆదేశాలిచ్చింది. అనుమతులు ఉన్నాయా? FTL పరిధిలో ఉందా? అన్న విషయం పరిశీలించాకే ముందుకెళ్లాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Janwada Farmhouse: జన్వాడ ఫాంహౌస్‌ ఎవరిది?

జన్వాడ ఫామ్‌హౌస్‌కు సంబంధించిన పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని హైడ్రాకు హైకోర్టు సూచించింది. కూల్చివేతలపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయ స్థానం తోసి పుచ్చింది.ఈ ఫాంహౌస్ కేటీఆర్ ది అన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. అయితే.. ఈ అంశంపై కేటీఆర్ ఈ రోజు స్పందంచారు. తనకు ఎక్కడా ఫాంహౌస్ లేదని స్పష్టం చేశారు.

కొన్నాళ్లు తన మిత్రుడి ఫాంహౌస్ ను తాను వాడుకున్నట్లు చెప్పారు. అయితే.. అది నిబంధనలు ఉల్లంఘించి నిర్మించినట్లు తేలితే తానే దగ్గర ఉండి కూల్చివేయిస్తానన్నారు. ఈ ఫాంహౌస్ తో పాటు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఫాం హౌస్ లను కూడా పరిశీలిద్దాం రావాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు.
ఇది కూడా చదవండి: RUNAMAFI: రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక నోడల్ ఆఫీసర్.. ఇవాళ్టి నుంచి ఫిర్యాదుల స్వీకరణ!

Advertisment
Advertisment
తాజా కథనాలు