హైదరాబాద్ లో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్రమ నిర్మాణాలను ఎక్కడికక్కడ కూల్చివేస్తోంది. ముఖ్యంగా బఫర్ జోన్లో చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఎన్ని ఒత్తిడిలు వచ్చినా తగ్గేదే లేదంటున్నారు హైడ్రా చీఫ్ రంగనాథ్. కూల్చివేతలపై తిరగబడ్డ అధికార పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కూడా ఆయన లైట్ తీసుకున్నారు. దీంతో నాగేందరే దారికొచ్చారు. హైడ్రాకు మద్దతు ప్రకటించారు. ఎంఐఎం ఎమ్మెల్యే చేపట్టిన నిర్మాణాన్ని సైతం కూడ్చివేసింది హైడ్రే. అడ్డుకున్న వారిని అరెస్ట్ చేసి మారి కూల్చివేతలను కొనసాగించింది. హైడ్రా కూల్చివేతలు జోరుగా కొనసాగుతున్న వేళ.. జన్వాడ ఫాంహౌస్ కూడా నేలమట్టం కాబోతోందన్న ప్రచారం సోషల్ మీడియాలో గత వారం నుంచి జోరుగా సాగుతోంది.
పూర్తిగా చదవండి..Janwada Farmhouse: జన్వాడ ఫాంహౌస్ ఎవరిది?
జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈ ఫామ్ హౌజ్ కేటీఆర్ దే అని.. ఆయనే పిటిషన్ వేయించాడని కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది తనది కాదని.. తన మిత్రుడిదని కేటీఆర్ ప్రకటించారు.
Translate this News: