Telangana: కోవిడ్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు: మంత్రి రాజనర్సింహ

కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. శనివారం వైద్య శాఖ మంత్రి రాజనర్సింహ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రులను సిద్ధం చేయడంతో పాటు.. ఆక్సీజన్‌ను అందుబాటులో ఉంచేలా చూడాలన్నారు.

Telangana: కోవిడ్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు: మంత్రి రాజనర్సింహ
New Update

Telangana Health Department: తెలంగాణలో కోవిడ్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. శనివారం నాడు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వివిధ ఆస్పత్రులలో ఉన్న వెంటిలేటర్ల పనితీరును పరిశీలించాలని వైద్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. కరోనా బాధితుల చికిత్సకు అవసరమయ్యే ఆక్సిజన్ కన్సన్​ట్రేటర్స్‌ను తక్షణమే ఉపయోగంలోకి తేవాలని ఆదేశించారు. వాడుకలో లేని వివిధ ఆస్పత్రిలో ఉన్న PSA ప్లాంట్స్‌ను త్వరితగతిన పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ల్యాబ్‌ల్లో ఒక్కరోజులో 16,500 ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయగలిగే సామర్థ్యం ఉందని.. మరో 84 ప్రైవేటు ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. డిసెంబర్‌ నెలాఖరులోగా రోజుకు 4వేల ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పాజిటివ్‌గా నిర్థారణ అయిన బాధితుల నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం సీడీఎఫ్‌డీ, గాంధీ ఆస్పత్రికి పంపించాలన్నారు.


రాష్ట్రంలో కొత్తగా 12 పాజిటివ్ కేసులు..

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,322 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్‌లో 9, వరంగల్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కటి చొప్పున నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో కోవిడ్ నుంచి ఒకరు కోలుకోగా.. మరో 38 మంది చికిత్స తీసుకుంటున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. మరో 30 మంది రిపోర్టులు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది.

Also Read:

సైబరాబాద్ పరిధిలో భారీగా పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు..!

 హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ బ్రిడ్జి మూసివేత.. ప్రత్యామ్నాయ రూట్ ఇదే!

#telangana #covid-19 #minister-raja-narsimha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe