Corona Cases: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మాస్కు తప్పనిసరి!

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. తెలంగాణలో మొత్తం 9 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

New Update
తెలంగాణలో కరోనా స్వైరవిహారం.. 24గంటల్లో ఎన్ని కేసులు పెరిగాయంటే

Telangana Corona Cases: దేశంలో అంతరించి పోయిందని అనుకున్న కరోనా కొత్త అవతారంలో నేను ఇంకా ఉన్నాను అంటూ మళ్లీ వచ్చింది. దేశంలో కరోనా భారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే ఈ కరోనా కారణంగా కొత్తగా ఐదు మంది తమ ప్రాణాలను కోల్పోయారు. దేశంలో కర్ణాటక, కేరళ నుంచి ఎక్కువ కేసులు నమోదు అవుతున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ముఖ్యంగా శబరిమల కు వెళ్లి వస్తున్న ప్రజలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం కోరింది.

ALSO READ: రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. నేడే అకౌంట్లోకి డబ్బులు జమ!

తాజాగా కరోనా తెలంగాణ ప్రజలకు హాయ్ చెప్పేందుకు సిద్ధమైంది. నిన్న (మంగళవారం) తెలంగాణ కొత్తగా నలుగురికి కరోనా సోకినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 9 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. దీనిపై అప్రమత్తం అయిన తెలంగాణ సర్కార్ కరోనాను నివారించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఇంటి బయట నుంచి వచ్చే తప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరింది. మాస్క్ ధరించకపోతే కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతుందని.. మాస్కులు పెట్టుకోవడం వల్ల కరోనా భారిన పడే అవకాశం తగ్గుతుందని తెలిపింది.

ALSO READ: బీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

కలవరపెడుతున్న కొత్త వేరియంట్ JN-1

మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కరోనా కొత్త వేరియంట్ JN-1 దేశంలో వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 142 కరోనా కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌, కేరళలో కరోనా కేసులు పెరుగుతన్నాయి. యూపీ, కేరళలో కరోనాతో ఐదుగురు మృతి చెందినట్లు పేర్కొంది. తాజాగా కరోనాతో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందినట్లు ప్రకటించింది. రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ చేసింది. ఆర్టీపీసీఆర్‌ టెస్టులు పెంచాలని ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశం ఇచ్చింది. కాసేపట్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అధ్యక్షతన హైలెవెల్‌ మీటింగ్ జరగనుంది. మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisment
తాజా కథనాలు