Telangana Jobs: ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్.. ఇవీ లెక్కలంటూ వెబ్‌సైట్ రిలీజ్.. తొమ్మిదిన్నరేళ్లలో 2,32,308 ఉద్యోగాలు గుర్తించి.. 1,60,083 పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. మొత్తం ఇంకా 42,652 పోస్టుల భర్తీ ప్రాసెస్‌లో ఉందని తెలిపింది. పూర్తి వివరాలను వెబ్‌సైట్(http://telanganajobstats.in/)లో చెక్ చేయొచ్చు. By Shiva.K 22 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections 2023: ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రధానంగా నిరుద్యోగం సెంట్రిక్ పాయింట్‌గా జరుగుతున్నాయి. బీఆర్ఎస్(BRS) మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడతామంటుంటే.. అంతొద్దు కాస్త తగ్గు అంటో బ్రేక్స్ వేస్తోంది కాంగ్రెస్(Congress). బై బై కేసీఆర్ అంటూ.. తెలంగాణలో ఈసారి పక్కా తమదే అధికారం అంటోంది కాంగ్రెస్. ఈ వ్యూహంలో భాగంగా తెలంగాణ రాజకీయాలను శాసించే విద్యార్థులనే తన ప్రధాన అస్త్రంగా మాలుచుకునే ప్రయత్నం చేస్తోంది. నిరుద్యోగంతో అల్లాడిపోతున్న విద్యార్థులను తమవైపు లాగేందుకు కాంగ్రెస్ పార్టీ ఏకంగా తేదీలతో సహా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించేసింది. ఈ ప్రకటన ఎఫెక్ట్ బీఆర్ఎస్‌కు గట్టిగా తగిలినట్లు పొలిటికల్ సర్కిల్‌లో డిస్కషన్ నడుస్తోంది. అందుకే విద్యార్థులను తమవైపు లాగే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నేతలు చెప్తున్నవన్నీ అసత్య ప్రచారాలు అని, తమ ప్రభుత్వం లక్షా అరవై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ఈ మేరకు నిరుద్యోగ విద్యార్థులతో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తొమ్మిదిన్నర ఏళ్లల్లో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించి, ఇందులో ఇప్పటికే 1,60,083 లక్షలకు పైగా భర్తీ చేశామన్నారు. అంతేకాదు.. ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను పేర్కొంటూ ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలను విద్యార్థులు విశ్వసించొద్దని, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలపై అనుమానం ఉంటే.. అధికారిక లెక్కలు చెక్ చేసుకోవచ్చునని తెలిపారు. అదే సమయంలో.. తాము మరోసారి అధికారంలోకి వస్తే.. టీఎస్‌పీఎస్‌సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. అధికారం చేపట్టిన మరుసటి రోజే నిరుద్యోగులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. వారి సూచనలు, సలహాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వం గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో ఎన్ని ఖాళీలను భర్తీ చేసింది.. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది.. ఎన్ని పోస్టులు ప్రాసెస్‌లో ఉన్నాయనే వివరాలను పేర్కొంటూ వెబ్‌సైట్‌ను విడుదల చేసింది. ఈ వెబ్‌సైట్ కోసం కింద లింక్ క్లిక్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు, భర్తీలు, ప్రభుత్వ ఉద్యోగుల వివరాలన్నింటి కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. Also Read: కేసీఆర్‌కు జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్.. కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదు.. #telangana-elections-2023 #telangana-elections #telangana-politics #telangana-govt-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి