Bharateeyudu 2 : 'భారతీయుడు 2' టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఒక్క టికెట్ పై ఎంత పెంచారంటే?

కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు 2' శుక్రవారం థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్ లో రూ. 50, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 75 పెంచుకునేందుకు కల్పించింది. వారం పాటు ఐదో షోకూ అనుమతి ఇచ్చింది.

New Update
Bharateeyudu 2 : 'భారతీయుడు 2' టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఒక్క టికెట్ పై ఎంత పెంచారంటే?

Telangana Govt Green Signal for 'Bharateeyudu 2' Ticket Price Hike : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ - సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'భారతీయుడు 2' శుక్రవారం థియేటర్స్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 75 పెంచుకునేందుకు కల్పించింది. సినిమా విడుదలకానున్న రోజు (శుక్రవారం) నుంచి ఈ నెల 19 వరకు ధరల పెంపునకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

publive-image

అంతేకాదు వారం పాటు ఐదో షోకూ అనుమతి ఇచ్చింది. సినిమా ప్రారంభానికి ముందు.. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై ప్రకటనలు ప్రదర్శించాలనే షరతు పెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ సీఎం డ్రగ్స్‌ నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించేలా వీడియోను తయారు చేసి ఇవ్వాలని సినీ ఇండస్ట్రీని కోరారు. అందులో భాగంగా కమల్ హాసన్, సిద్ధార్థ, సముద్రఖని లాంటి యాంటి డ్రగ్స్‌పై వీడియోను రిలీజ్ చేశారు.

Also Read : డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌కు మంచు విష్ణు వార్నింగ్.. అలా చేస్తే ఊరుకోమంటూ!

ఇక భారతీయుడు 2 విషయానికొస్తే.. అప్పట్లో వచ్చిన 'భారతీయుడు' సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. కమల్ హాసన్ తో పాటూ సిద్దార్థ్,రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, సముద్ర ఖని, SJ సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చారు.

Advertisment
తాజా కథనాలు