BREAKING: సొంత ఇళ్లు లేనివారికి రూ.5 లక్షలు.. కీలక ప్రకటన

TG: సొంత ఇళ్లులేని వారికి గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు రూ.5 లక్షల సాయం చేయనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

New Update
BREAKING: సొంత ఇళ్లు లేనివారికి రూ.5 లక్షలు.. కీలక ప్రకటన

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు రూ.5 లక్షల సాయం చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.6 లక్షల సాయం అందిస్తామన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3 వేల 500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రం మొత్తం 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతామని వివరించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,816 కోట్లు, మహాలక్ష్మి ఉచిత రవాణాకు రూ.723 కోట్లు, అప్పులకు వడ్డీల కోసం రూ. 17,729 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు