TSRTC Jobs : తెలంగాణ(Telangana) లో కొలువుల జాతర జరగనుంది. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులునింపేందుకు గవర్నమెంటు కీకల నిర్ణయాలు తీసుకుంటోంది. టీఎస్ఆర్టీసీ(TSRTC) లో జాబ్స్ మేళా షురూ కాబోతోంది. 3వేల కొత్త ఉద్యోగాల కల్పనకోసం ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. దీని మీద రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేవారు. తర్వరలోనే ఆర్టీసీలో ఉద్యోగాలు భర్తా చేస్తామని చెప్పారు.
ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది...
ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీలో 43 వేల మంది ఉద్యోగాలు(Jobs) చేస్తున్నారు. గత పదేళ్ళల్లో సంస్థలో కొత్త నియామకాలు లేవని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) తెలిపారు. దీని మీద కసరత్తులు చేస్తున్నామని త్వరలోనే కొత్త ఉద్యోగాలకు రూపకల్పన చేస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కొత్త నియామకాల మీద నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహాలక్ష్మి స్కీమ్ తర్వాత ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగిందని...దానికి అనుగుణంగా కొత్త బస్సులను ఏర్పాటు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అదే కనుక జరిగితే కచ్చితంగా కొత్త నియామకాలు కూడా జరగాలి. ప్రస్తుతం ఉన్న స్టాఫ్ సరిపోరు. కాబట్టి కచ్చితంగా జాబ్స్ ప్రకటన చేస్తామని మంత్రి చెప్పారు.
Also read:YS Sharmila : కడప రాజకీయాల్లో సంచలనం.. షర్మిలతో సునీత భేటీ.
కొత్త బస్సులు వస్తున్నాయ్...
ప్రస్తుత రద్దీని తట్టుకోవాలంటే కొత్త బస్సులతో పాటూ 3 వేలమంది సిబ్బంది అవసరమవుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 31న అంటే మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించిన వార్త చెబుతామని అన్నారు. ఇప్పటికే 1325 డీజిల్, 1050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ 2,375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయన్నారు. వీటితో పాటు ఇంకొన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోందని చెప్పారు.
డ్రైవర్లు, కండక్టర్స్ కావాలి...
కొత్త జాబ్స్‌లో డ్రైవర్లు, కండక్టర్లను ఎక్కువగా తీసుకుంటామని చెబుతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాబట్టి దీనికి అర్హులైన వారందరూ రెడీగా ఉండాలని సూచించారు. కొత్త బస్సులు వస్తున్నాయని కాబట్టి ఎక్కువ మంది స్టాఫ్ అవసరం అవుతారనే ఉద్దేశంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్ల పరిధిలో నాన్ ఇంజినీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణ కోసం TSRTC దరఖాస్తులు కోరింది. 150 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. డిగ్రీ చదివిన విద్యార్థులు ఫిబ్రవరి 16లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read : Breaking: స్టాఫ్ నర్స్ ఫలితాలు రిలీజ్..ఇలా చెక్ చేసుకోండి..!!